గుజరాత్‎లో తీరం దాటిన సైక్లోన్ బిపార్జోయ్, రాజస్థాన్ దిశగా ప్రయాణం..!!

New Update

గుజరాత్‌లో తీరం దాటి విధ్వంసం సృష్టించిన బైపర్‌జోయ్ ఇప్పుడు రాజస్థాన్ వైపు కదులుతోంది. బైపార్జోయ్ తుపాను కారణంగా గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకూలాయి. గుజరాత్‌లో తుపాను కారణంగా ఇద్దరు మరణించారు. 23 మంది గాయపడ్డారు, వందలాది గ్రామాలకు విద్యుత్ నిలిచిపోయింది.

Cyclone Biparjoy

సైక్లోన్ బిపార్జోయ్ తుఫాను ప్రభావం గుజరాత్‌లో విధ్వంసం స్రుష్టిస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు, స్తంభాలు నేలకొరిగాయి. కచ్, సౌరాష్ట్ర తీరప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బలమైన గాలుల కారణంగా జఖౌ, మాండ్విలో అనేక చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రం బిపార్జోయ్ ల్యాండ్ ఫాల్ జరిగింది. దీని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, NDRF, SDRF సహా అనేక బృందాలను మోహరించాయి.

భావ్‌నగర్ జిల్లాలో వరద వాగులో చిక్కుకున్న మేకలను రక్షించే ప్రయత్నంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. అదే సమయంలో దేవభూమి ద్వారకలో చెట్లు కూలడంతో ముగ్గురు గాయపడ్డారు. తుపాను ప్రస్తుతం 13-14 కి.మీ వేగంతో కదులుతోంది. తుఫాను కారణంగా ఈరోజు కూడా కచ్, ద్వారక, జామ్‌నగర్‌లలో బలమైన గాలులతో కూడిన వర్షం కురుస్తుంది.

తుపాన్ కు సంబంధించి అప్ డేట్స్ ఇవి..

- సౌరాష్ట్ర-కచ్‌లోని 179 గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 2500కు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

-తుపాన్ దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ గుజరాత్ సీఎంతో ఫోన్‌లో మాట్లాడారు. గుజరాత్‌లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆరా తీశారు.

-బైపార్జోయ్ తుఫాను కారణంగా అహ్మదాబాద్ మీదుగా వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి.

-తుపాను ధాటికి సూరత్‌లో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో పాటు పలుచోట్ల చెట్లు నేలకూలినట్లు సమాచారం.

-తుపాను కారణంగా గుజరాత్, రాజస్థాన్ లలో నేడు, రేపు జూన్ 16, 17 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

-రాబోయే నాలుగు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

-బిపార్జోయ్ తుపాను కారణంగా హర్యానాలోని 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ హర్యానాలోని మహేంద్రగఢ్, రేవారి, గురుగ్రామ్, మేవాత్, పల్వాల్, ఫరీదాబాద్‌లలో బిపార్జోయ్ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

- గుజరాత్ తర్వాత, బిపార్జోయ్ తుఫాను రాజస్థాన్, ఆపై దక్షిణ హర్యానాకు చేరుకుంటుంది. అయితే, తుపాను హర్యానాకు చేరుకున్న తర్వాత బలహీనపడే అవకాశం ఉంది. దీనిప్రభావం ఇతర రాష్ట్రాలపై తక్కువ ఉండే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు