Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సైబర్ నేరగాళ్లు

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. భారత్ జోడో యాత్ర, డొనేట్ కాంగ్రెస్ పేర్లతో నకిలీ సృష్టించి సామాన్యుల నుంచి డబ్బు దోచేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update
Congress Party : కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

Fake Congress Website: సైబర్ నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు సైబర్ నేరగాళ్లు. కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. భారత్ జోడో యాత్ర, డొనేట్ కాంగ్రెస్ పేర్లతో నకిలీ సృష్టించి సామాన్యుల నుంచి డబ్బు దోచేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. జైపూర్ కు చెందిన సుందర్ చౌదరి అనే వ్యక్తి ఈ నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ కవితను కూడా వదలలేదు..

తెలంగాణ రాజకీయ నాయకులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలు (Social Media Accounts Hack), ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. వారి టార్గెట్ ఎమ్మెల్సీ కవిత అయింది. ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి (Telangana DGP) ఫిర్యాదు చేశారు. 

లిస్టులో గవర్నర్ తమిళిసై..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు (Tamilisai Soundararajan) సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. గవర్నర్ తమిళి‌సై అఫీషియల్ ట్విట్టర్ ఖాతాను (Twitter Account Hack) హ్యాక్ చేశారు. ఈనెల 14న దీనిపై సైబర్ క్రైమ్‌లో రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ట్విట్టర్ (X) ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఇతర ఫోటోలు పెట్టడంతో పోలీసులకు అధికారులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మంత్రి దామోదర రాజనర్సింహ కూడా..

ఎమ్మెల్సీ కవిత, గవర్నర్ తమిళి‌సై యే కాకుండా ఈ లిస్టులో మొదటి వరుసలో నిలిచారు కాంగ్రెస్ మంత్రి. ఇటీవల వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ( Damodar Raja Narasimha) ఫేస్ బుక్ అకౌంట్‌ను సైతం సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన తెలిపారు. ఆయన ఫేస్ బుక్ ఖాతాలో టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, తమిళనాడు సీఎం స్టాలిన్ కు సంబంధించిన పోస్టులు దర్శనమివ్వడంతో ఈ విషయాన్ని గుర్తించారు. దీనిపై మంత్రి దామోదర రాజ నర్సింహ స్పందిస్తూ తన పేరుపై వస్తున్న మెసేజిలకు ఎవరు రెస్పాండ్ కావద్దని అన్నారు. దీనిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హ్యాకర్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు