Cyber Crime: ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ వాడని వారు లేరు. స్మార్ట్ ఫోన్ వాడేవారు తమ రకరకాల అవసరాల కోసం అనేక యాప్స్ డౌన్‌లోడ్ చేస్తూ ఉంటారు. అయితే, ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొద్దిరోజుల క్రితం చండీగఢ్ లో ఒక మహిళ ఎదో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. వెంటనే ఆ ఫోన్ హ్యాక్ అయింది. తరువాత ఆమె ఫోటోలను హ్యాకర్ అసభ్యంగా మార్చి ఆమెను బెదిరించి 43 లక్షల రూపాయలు కాజేశాడు. అలాగే IRCTC నకిలీ యాప్ ను సృష్టించి ఆ లింక్ సోషల్ మీడియా ద్వారా పంపించి డౌన్‌లోడ్ చేసుకునేలా చేశారు. దాని ద్వారా లక్షలాది మంది మోసపోయారు. ఇవి ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు మాత్రమే.
నిత్యం చాలామంది ఇలా యాప్స్ డౌన్‌లోడ్ చేయడం ద్వారా మోసపోతున్నారు. అసలు యాప్స్ డౌన్‌లోడ్ చేయడం వలన ఎలా సైబర్ నేరగాళ్ల(Cyber Crime) వలలో చిక్కుతాం? సైబర్ నేరగాళ్లు ఏమి చేస్తారు? వీటి నుంచి తప్పించుకోవడానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు మోసం ఎలా చేస్తారు?
మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా, హ్యాకర్లు వినియోగదారుల లొకేషన్‌ను సులభంగా కనుగొని, ఆపై వారిపై బ్యాంకింగ్ మోసానికి పాల్పడతారు.
ఈ పనిలో మెషీన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సహాయం తీసుకుంటారు. దీని కింద, అనేక మొబైల్ నంబర్‌లకు ఒకేసారి అనేక మెసేజ్ లు పంపిస్తారు. ఈ మెసేజ్ లలో లింక్స్ ఇస్తారు. ఆ లింక్స్ క్లిక్ చేసిన వెంటనే యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ యాప్స్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో అనేక పర్మిషన్స్ అడుగుతాయి. సాధారణంగా మనం అన్ని పర్మిషన్స్ ని ఎలో చేసేస్తాము. ఇక్కడే హ్యాకర్ల(Cyber Crime) దొరికిపోతాము. మనం పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే ఆ యాప్స్ మన స్మార్ట్ ఫోన్ లోని కాంటాక్ట్ లిస్ట్ మొదలుకొని బ్యాంక్ ఎకౌంట్స్ వివరాల వరకూ అన్నిటినీ లాగేస్తాయి. తరువాత హ్యాకర్స్ ఎకౌంట్స్ ఖాళీ చేసేస్తారు. ఒక్కోసారి మనం మనకి వచ్చిన మెసేజ్ లింక్ క్లిక్ చేసినా హ్యాకర్లు మన ఫోన్ లోకి చొరబడిపోతారు. అటువంటప్పుడు మనకు తెలీకుండానే మన బ్యాంక్ ఎకౌంట్ డీటైల్స్ వారికి చేరిపోతాయి.
Also Read: దొంగా.. దొంగా.. బాబోయ్.. ఏకంగా ఆలయానికే కన్నం వేశారుగా
సైబర్ నేరగాళ్లకు దొరకకుండా ఏమి చేయాలి?
ఎట్టి పరిస్థితిలోనూ తెలియని నెంబర్ల నుంచి వచ్చిన మెసేజ్ లు చూడవద్దు. వాటిలో లింక్స్ ను క్లిక్ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.
మీరు ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసే(Cyber Crime) సమయంలో అడిగే పర్మిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్మిషన్ దేని కోసం అడుగుతుంది? అది ఇవ్వడం వలన ఎటువంటి సమాచారాన్ని యాప్ కు యాక్సెస్ ఇస్తున్నాము అనే విషయాన్ని కచ్చితంగా పరిశీలించాలి. ఎటువంటి పరిస్థితిలోనూ మన ఫైనాన్షియల విషయాలకు పర్మిషన్ అడిగే యాప్స్ ను ఇన్‌స్టాల్ చేయకపోవడమే మంచిది.
ప్లేస్టోర్ నుంచి మాత్రమే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అక్కడ నుంచి కూడా ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఆ యాప్స్ సెక్యూరిటీ రేటింగ్స్ చెక్ చేసుకోవాలి.
అప్రమత్తతే అన్నిటికన్నా మించిన ఆయుధం. అధికారికంగా పనిచేసే యాప్స్ ఏవీ కూడా అనవసరమైన యాక్సెస్ మోసం(Cyber Crime) పర్మిషన్స్ అడిగావు. అలాగే ఓటీపీలు షేర్ చేయమని చెప్పావు. మిమ్మల్ని ఏదైనా యాప్ ఓటీపీ షేర్ చేయమని అడిగింది అంటే అది మీకు ప్రమాదాన్ని తెస్తుందని అర్ధం.
అందువల్ల యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే సైబర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడం మంచిది.
Please watch this interesting video: