Fraud: రెప్పపాటులో మీ డబ్బు మొత్తం ఊడ్చిపెట్టుకుపోవచ్చు.. ఇవి గుర్తుపెట్టుకోండి..!

మీరు లాటరీ గెలుచుకున్నారని వచ్చే ఇమెయిల్స్‌ లేదా మెసేజీలను నమ్మకండి. మొబైల్ ఫోన్‌లకు చాలా తెలియని లింక్‌లను పంపుతుంటారు మోసగాళ్లు. వాటిపై క్లిక్‌ చేస్తే డబ్బులు గల్లంతే. మీ మొబైల్‌లో వచ్చిన OTPని ఎవరితోనూ షేర్ చేయకూడదు. మీరు ఇలా చేస్తే మోసానికి గురయ్యే అవకాశం ఉంది.

New Update
Cyber Crime: రూ.26 కోట్ల మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్టు

Cyber Alert: ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును వారి బ్యాంకు ఖాతాలలో ఉంచుతారు. ATM లేదా ఆన్‌లైన్ మార్గాల ద్వారా అవసరమైనప్పుడు ఖర్చు చేస్తారు. నేటి ఖర్చు కంటే రేపటి కోసం ఎక్కువ డబ్బును కూడా ఆదా చేస్తారు. కానీ వీటన్నింటి మధ్య మోసగాళ్ళు ఎంటర్ అవుతారు. ప్రజలను మోసం చేయడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. మారుతున్న సాంకేతికత మధ్య మీరు అప్రమత్తంగా లేకపోతే రెప్పపాటులో మొత్తం డబ్బు పోగట్టుకోవచ్చు. అందుకే మనం మోసానికి గురయ్యే ప్రమాదాలు ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

--> సాధారణంగా లాటరీ, బహుమతి మొదలైన వాటి పేరుతో మోసం జరుగుతుంది. ఇందులో మోసగాళ్లు మీకు ఇమెయిల్ లేదా కాల్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ఈ కాల్స్‌కు ట్రాప్‌ అయ్యే ప్రమాదం ఎక్కువ. మంచిగా మాట్లాడి నట్టెటా ముంచేస్తారు కేటుగాళ్లు. అందుకే ఇలాంటి కాల్ లేదా ఇమెయిల్ మొదలైనవాటిని ఎప్పుడూ నమ్మవద్దు.

Also Read: ఉచిత శిక్షణ.. రూ.10వేల వేతనం.. మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!

--> మొబైల్ ఫోన్‌లకు చాలా తెలియని లింక్‌లను పంపుతుంటారు మోసగాళ్లు. మీరు వాటిపై క్లిక్ చేస్తే మీరు మోసానికి గురవుతారు. ఈ లింక్‌లు సంగీతం, ఇమెయిల్ లేదా సోషల్ మీడియా (Social Media) ద్వారా మిమ్మల్ని చేరుకోవచ్చు. మీరు అలాంటి లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే వారు మీ మొబైల్‌ను హ్యాక్ చేయవచ్చు. కాబట్టి తెలియని లింక్స్‌పై ఎప్పుడూ క్లిక్ చేయకండి.

--> రుణాల (Loans) పేరుతో మోసగాళ్లు ప్రజలను చాలా మోసం చేస్తున్నారు. మీ మొబైల్‌లో మీ లోన్ అప్రూవ్ అయిందని లేదా మీ క్రెడిట్ కార్డ్ సిద్ధంగా ఉందని మెసేజ్ వస్తుంది. దాన్ని పొందడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండని మెసేజ్ వస్తుంది. ఈ లింక్‌పై క్లిక్ చేయగానే మిమ్మల్ని మోసం చేసే ఆట ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఈ లింక్‌లు అన్నీ నకిలీవి. వాటిని ఎప్పటికీ నమ్మవద్దు. రుణాల పేరుతో దోచుకునే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. రుణాలు బ్యాంకుల నుంచి పొందితేనే మంచిదని పోలీసులు పదేపదే చెబుతుంటారు.

--> మీ మొబైల్‌లో వచ్చిన OTPని ఎవరితోనూ షేర్ చేయకూడదు. మీరు ఇలా చేస్తే మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా క్యాష్‌బ్యాక్ ఇమెయిల్ లేదా ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు అది నిజమైనదా కాదా అని తెలుసుకోండి. లేకుంటే మోసపోవచ్చు.

Advertisment