AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి 11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి CWC Raghuveera Reddy: కేంద్ర బడ్జెట్ పై సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 11వ బడ్జెట్ లోనూ (Union Budget 2024) కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందిని విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారని.. అయితే, ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా? లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా? అన్నది క్లారిటీ లేదన్నారు. బడ్జెట్లో ప్రత్యేక హోదా ఊసే లేదని.. పోలవరం గురించి పై పై మాటలు మాత్రమే మాట్లాడారని అన్నారు. ఇప్పటికైనా ఏపీ లోని ప్రాంతీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉందని.. టీడీపీ, జనసేనతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడుపుతోందని అందుకు మేం చాలా ఆశించాం కానీ ఏపీకి తీరని నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. Also Read: నేటి నుంచి 27 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు ఏపీ అభివృద్ధిపై కూటమి నేతలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని నిలదీశారు. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీ నేతలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలు గట్టిగా నిలబడితే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నిస్తామన్నారు. #union-budget-2024 #raghuveera-reddy #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి