కోహ్లీ(Kohli)ని తక్కువ అంచనా వేస్తే మాములగా ఉండదు.. అసలు క్రికెట్‌లో సచిన్ రికార్డులను ఈజీగా బ్రేక్ చేసిన క్రికెటర్ కోహ్లీ మాత్రమే. వన్డేల్లో సచిన్ రికార్డులు ఇప్పటికే చాలా వరకు బ్రేక్ చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు రికార్డును బ్రేక్ చేసేందుకు అతి దగ్గరలో ఉన్నాడు. నిజానికి కోహ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి సచిన్ వారసుడిగానే అభిమానులు గుర్తిస్తున్నారు. అలాంటి కోహ్లీని గ్రౌండ్‌లో స్లెడ్జింగ్ చేసిన వారి సంఖ్య కాస్త ఎక్కువే. కోహ్లీ చాలా దూకుడిగా ఉంటాడు. మాటకు మాట చెబుతాడు. గొడవకు అసలు వెనకాడడు. అందుకే కోహ్లీని కవ్వించే బౌలర్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక వికెట్ తీసిన తర్వాత బౌలర్ల భావోద్వేగాలు కొన్నిసార్లు హద్దు దాటుతుంటాయి. నోరు పారేసుకుంటారు. నెదర్లాండ్స్ క్రికెటర్ కూడా ఓసారి అదే చేశాడు.
2011లో ఏం జరిగింది?
2011 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్(netharlands) తరుఫున ఆడిన ఆటగాళ్లు ఎవరూ కూడా ప్రస్తుత డచ్ జట్టులో లేరు. వెస్లీ బరేసి మాత్రం ఆడుతున్నాడు. . 2011లో చివరిసారిగా భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్‌లో వెస్లీ ఆడాడు. భారత్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో వెస్లీ విరాట్ కోహ్లీ వికెట్ తీశాడు. 2011 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీతో టోర్నీని ఆరంభించిన కోహ్లీ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్ వరకు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2011 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ ఇండియాపై ఆడింది. బరేసీ ఆ ప్లేయింగ్-11లో ఉన్నాడు. ఢిల్లీలో ఆ మ్యాచ్ జరిగింది. భారత్ 190 పరుగుల ఛేదనలో 12 పరుగుల వద్ద కోహ్లీకి పెవిలియన్‌కి పంపాడు బరేసీ.
కోహ్లీని అవుట్ చేసిన తర్వాత ఆవేశంతో నోరు పారేసుకున్నాడు. 'మేము మళ్లీ(నిన్ను) చూడలేము' అని అరిశాడు. 'బహుశా ఆ రాత్రి నేను కొంచెం ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, కానీ అప్పుడు భారత జట్టును చూస్తే, వారికి సూపర్ స్టార్లు పుష్కలంగా ఉన్నారు.. అప్పుడు కోహ్లి యువకుడు' అయితే ఇప్పుడు నా అంచనా తప్పు అయ్యిందని చెప్పుకొచ్చాడు. 12ఏళ్ల తర్వాత బరేసీ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇక నిన్న ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టీమిండియాను గెలిపించాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టా్ల్లో ఉన్న టీమిండియాను రాహుల్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకోల్పి గెలిపించాడు.
ALSO READ: ఆ గ్రౌండ్‌లో డైవ్ చేస్తే మీ పని గోవిందా.. ఇదేం దరిద్రం భయ్యా.. కెప్టెన్ ఫైర్..!