మీ మొబైల్ పౌచ్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..

సాధారణంగా కొంతమంది మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనక కరెన్సీ నోట్లు దాచిపెట్టుకుంటారు. అలాగే ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా దాచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల పెద్ద నష్టం అని మీకు తెలుసా? మీరు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే అని మర్చిపోకండి.

మీ మొబైల్ పౌచ్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
New Update

మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనక కరెన్సీ నోట్లు దాచుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. మనలో చాలా మంది ఇలాగే చేస్తూ ఉంటారు. అంతేకాదు ఏటీఎం కార్డ్స్, బస్సు టికెట్లు, బిల్స్ ఇలాంటివి మొబైల్ కవర్‌ వెనక పెట్టుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఓవర్ హీట్ అయి పేలిపోతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వేల రూపాయలు పెట్టి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫోన్ పేలిపోతుంది. అంతేకాదు మనం కూడా ప్రమాదంలో పడే అవకాశముంది.

ఇలా జరగడానికి కొన్ని కారణాలను కూడా ఆ నివేదికలో పొందుపరిచారు..

** మీ ఫోన్ తరుచుగా వేడెక్కుతుందంటే మీ మొబైల్‌లో కరెన్సీ నోట్స్ లేదా మందపాటి పేపర్లు ఉన్నాయని గుర్తించాలి.

** ఎక్కువ సేపు మొబైల్ మాట్లాడినప్పుడు కానీ లేదా ఫోన్ వాడినప్పుడు కానీ హీట్ ఎక్కుతుంది. ఇదే సమయంలో డబ్బులు లేదా ఇతర పేపర్లు ఉండడం వల్ల ఫోన్ ఓవర్‌హీట్ అవ్వడం ప్రారంభమవుతుంది. ఒక్కోసారి అది పేలుడుకు కూడా దారి తీస్తుంది.

** మీరు డబ్బు నోట్లను ఫోన్‌లో ఉంచినట్లయితే.. అది వైర్‌లెస్ ఛార్జింగ్‌లో సమస్యలను కూడా కలిగిస్తుంది.

** ఫోన్ కవర్‌లో నోట్లను ఉంచుకోవడం వల్ల కొన్నిసార్లు నెట్‌వర్క్ సమస్యలకు కూడా దారితీయవచ్చు. అలాగే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించడం కూడా ఫోన్ పేలడానికి కారణమవుతుంది.

వేల రూపాయలు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మీ ఫోన్ పేలకుండా ఉండాలనుకుంటే పైన తెలిపిన చిట్కాలను ఫాలో అయిపోండి.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe