Health Benefits : ఈ మూడు కలిపి తింటే..ఆ ఎనిమిది రోగాలు ఫసక్..!!

జీలకర్ర, వాము, బ్లాక్ సాల్ట్ ఈ మూడూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి దివ్యౌషధంగా కూడా పనిచేస్తాయి. వీటి వినియోగం ద్వారా అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ మూడింటి వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

New Update
Health Benefits : ఈ మూడు కలిపి తింటే..ఆ ఎనిమిది రోగాలు ఫసక్..!!

Jeera, Ajwain Black Salt Benefits : వంటగదిలో ఉండే మసాలాలు ఆహార రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. వీటిలో చాలా మసాలా దినుసులను తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఈ రోజు మనం అలాంటి కొన్ని మసాలా దినుసుల గురించి తెలసుకుందాం. వీటిని మిశ్రమం తయారు చేసి తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. నిజానికి జీలకర్ర, వాము, బ్లాక్ సాల్ట్ అనే మూడు పదార్ధాలు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. జీలకర్ర, వాములో ప్రధానంగా ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, బ్లాక్ సాల్ట్ వంటి పోషక మూలకాలు సోడియంకు మంచి మూలం. ఈ మూడు పదార్థాల మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. దాని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

Read Also :ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!

మధుమేహంలో :
జీలకర్ర,వాము, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే జీలకర్ర, వాము, బ్లాక్ సాల్ట్ లో ఉండే యాంటీ డయాబెటిక్ ప్రభావం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

దగ్గు, జలుబు నుండి ఉపశమనం:
ఈ మూడింటి సమ్మెళనం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతుంది. అంతే కాకుండా ఈ మూడు పదార్థాలను పొడి చేసి నీటిలో కలిపి తాగడం వల్ల దగ్గు, జాండిస్ వంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.

బీపీ కంట్రోల్లో ఉంటుంది:
జీలకర్ర, వాము, బ్లాక్ సాల్ట్ తీసుకోవడం కూడా అధిక రక్తపోటు రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల ఉప్పులో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూడు పదార్థాలను కలిపి తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది.

బరువు తగ్గడంలో:
మీరు బరువును తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయి...జీలకర్ర,వాము, నల్లఉప్పును కలిగి తీసుకోండి. జీలకర్ర, వాములో ఉండే ఫైబర్, బ్లాక్ సాల్ట్ లో ఉండే యాంటీ ఒబేసిటి లక్షణాలు బరువును తగ్గించడంలో సహాయడపతాయి.

గ్యాస్, అజీర్ణ సమస్యలు దూరం:
అజీర్ణం లేదా అసిడిటీ వంటి సమస్యల విషయంలో జీలకర్ర, వాము, నల్ల ఉప్పు మిశ్రమాన్ని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి జీలకర్ర, వాము, బ్లాక్ సాల్ట్‌లో ఉండే ఫైబర్‌లు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

 Read Also : తొక్కె కదా అని తీసిపారేయకండి..వాటిలోని హెల్త్ బెనిఫిట్స్ తెలుస్తే వదిలిపెట్టరు..!!

దంతాలకు మంచిది:
ఇవి దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందులో ఉండే క్యాల్షియం దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా పోతుంది. ఈ మూడింటి మిశ్రమంతో ప్రతిరోజూ దంతాలను శుభ్రంచేసుకోవాలి.

రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
జీలకర్ర,వాము, నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు వైరస్‌లు, బ్యాక్టీరియా నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి :
వాము కడుపులో ఎసిడిటీ, అధిక మొత్తంలో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. అదే సమయంలో, బ్లాక్ సాల్ట్ కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది.

(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)

Advertisment
Advertisment
తాజా కథనాలు