Business Ideas : ఒక్క ఎకరం భూమి ఉన్నా చాలు..మీరు కోటీశ్వరులు అయినట్లే...ఎలాగో తెలుసా?

నేటికాలంలో యువత ఎక్కువగా వ్యాపారంవైపు అడుగులు వేస్తోంది. ఎకరం భూమి ఉంటే చాలు..అందులో బిర్యానీ ఆకు పంట సాగు చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఈ మొక్కను ఒక్కసారి నాటితే...పెద్ద మొత్తంలో పంట చేతికి వస్తుంది. ఈ ఆకుకు మార్కెట్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది.

New Update
Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!

ఈరోజుల్లో చాలా మంది వ్యాపారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే వ్యాపారం చేస్తున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. పెరుగుతున్న ఖర్చులకు వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో చాలా మంది సైడ్ బిజినెస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే వ్యాపారం పెట్టేందుకు పెట్టుబడికావాలి. పెట్టుబడి లేక చాలా మంది వ్యాపారం వైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. అలాంటివారికోసం కేంద్రంలో మోదీ సర్కార్ ముద్ర స్కీం ద్వారా లోన్లు కూడా ఇస్తోంది. అలాంటప్పుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించే ఒక బెస్ట్ ఐడియా మా దగ్గర ఉంది. అది మీకోసం అందిస్తున్నాము. ఇందులో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే..మీ జీవితమంతా లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. అదే బిర్యానీ ఆకు సాగు. ఈ సాగు ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.

బిర్యానీ ఆకు అనేది ఒకరకమైన సాగు..ఈ పంటలో మొక్కను ఒకసారి నాటితే...పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. దీనిని ఇంగ్లీష్ లో బే లీఫ్ అని పిలుస్తారు. బిర్యానీ ఆకు సాగును వాణిజ్యీకరించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. తక్కువ శ్రమ, ఖర్చుతో ఈ పంటను సాగు చేయవచ్చు. బిర్యానీ ఆకుకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ సందర్బంలో దాని సాగు లాభదాయకమైనదని నిరూపితమైంది.

బిర్యానీ ఆకు ఆమెరికా, యూరప్ తోపాటు ఇండియాలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని సూప్ లు, నాన్ వెజ్, వెజిటెబుల్ డిష్ లలో ఉపయోగిస్తారు.భారత్, పాకిస్తాన్ లో దీనిని మసాలా వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వంటల్లో వాడటమే కాదు..మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ బిర్యానీ ఆకు ప్రధానంగా ఇండియా, రష్యా, మధ్య అమెరికా, ఇటలీ, ప్రాన్స్, ఉత్తర అమెరికా, బెల్జియం దేశాల్లో సాగుచేస్తున్నారు.

బిర్యానీ ఆకు సాగును ప్రోత్సహించేందుకు రైతులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు ద్వారా 30శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. ఇప్పుడు దాని నుంచి వచ్చే ఆదాయం గురించి చర్చించుకుంటే...ఒక బిర్యానీ ఆకు మొక్క నుంచి ఏడాది మూడు వేల నుంచి 5వేలు సంపాదించవచ్చు. ఈ విధంగా 25మొక్కలు నాటితే వాటి నుంచి ఏడాదికి 75వేల నుంచి 1,25,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. మీకు ఐదెకరాల భూమి ఉందనుకుంటే బిర్యానీ ఆకు సాగు ప్రారంభించవచ్చు. ఈ వ్యవసాయం చేయడానికి మీరు మొదట్లో కొంత శ్రమించాల్సి ఉంటుంది. కానీ మొక్క పెరుగుతున్నా కొద్దీ శ్రమ తగ్గుతుంది. దీని సాగు ద్వారా ఏడాది తర్వాత మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: చైనాలో భారీ భూకంపం…వందకు పైగా మృతి, చాలా మందికి గాయాలు..!!

Advertisment
తాజా కథనాలు