Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్! ఏలూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామల మీద దాడిచేసేందుకు వెళ్లిన బాలాజీ భార్య చెల్లెలి రెండు నెలల కొడుకును కొట్టి చంపాడు. స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. By srinivas 15 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి AP Crime: ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యమీద కోపంతో బాలాజీ అనే సీఆర్ ఫీఎఫ్ కానిస్టేబుల్ నెలల పసికందును హతమార్చాడు. ఈ మేరకు కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా గొడవలు జరుగుతుండగా.. పాత కేసు విషయంలో ఈరోజు ఏలూరు కోర్ట్ కు వచ్చిన బాలాజీ కేసు విషయంలో భార్య, మామతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే భార్య, మామను అక్కడే చితకబాదిన బాలాజీ.. ఆపై లింగపాలెం మండలం పాశ్చానగరంలో మరదలు ఇంటికెళ్లి అత్త, మరదలుపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే ఉక్రోషంతో మరదలి కుమారుడైన రెండు నెలల పసికందును తలపై గాయపరిచడంతో పసిగుడ్డు అక్కడే ప్రాణాలొదిలాడు. అయితే ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు బాలాజీని అడ్డుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలజీను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మజిగూడెం పోలీసులు తెలిపారు. #killed #two-months-old-baby #crpf-constable-balaji మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి