వైన్ షాపుల ముందు.. క్యూ కట్టిన మందుబాబులు

హైదరాబాద్‌లో బోనాలు మందు ప్రియులకు కష్టాలు తెచ్చి పెట్టింది. మందు బాటిళ్ల కోసం చాలా కష్టపడి గంటల కొద్ది క్యూలో నిలబడి మరి బాటిల్‌ని కొనుకుంటున్నారు. అయితే రెండు రోజులు వైన్ షాపులు బందు కారణంగా ఈ రద్దీ పెరిగింది. ఇక కొన్నిచోట్ల అయితే ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మామూలుగా వీకెండ్‌లో కొంత రద్దీ ఉండడం మమూలే. కానీ ఈ వీకెండ్‌కు ఇంతలా హైదరాబాద్‌లో మందు షాపుల ముందు విపరీతంగా రద్దీ ఉండటానికి కారణం ఉంది.

New Update
వైన్ షాపుల ముందు.. క్యూ కట్టిన మందుబాబులు

publive-image

అయితే హైదరాబాద్‌లోవైన్ షాపుల ముందు విపరీతంగా రద్దీ కనిపిస్తుంది. ఏకంగా కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మామూలుగా వీకెండ్‌లో కొంత రద్దీ ఉండడం కామన్. కానీ ఈ వీకెండ్‌కు ఇంతలా ఉండటానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే లాక్ డౌన్ తర్వాత మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది. మళ్లీ అదే స్థాయిలో ఇప్పుడు వైన్ షాపుల ముందు మద్యం ప్రియుల సందడి కనిపిస్తుంది. దసరా పండుగను మించిన రద్దీ. ఇంతకు విశేషం ఏంటి అనుకుంటున్నారా..హైదరాబాద్ బోనాలు.. ఆదివారం సోమవారం వైన్ షాపులు బంద్ కావడంతో ఈ రెండు రోజులకు కావలసిన సరుకును ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటున్నారు మద్యం ప్రియులు.

హైదరాబాద్‌లో బోనాలంటే మామూలుగా ఉండదు మరి..ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలను పిలుచుకొని గట్టి దావత్ ఇస్తారు. అసలే తెలంగాణలో మందుకు ప్రత్యేక స్థానం ఉంది. వైన్ షాపులు బంద్ ఉన్నా వచ్చిన చుట్టాలకు కాందన్‌లో ఫరక్ రాకుండా చూడాలంటే ఈ మాత్రం సరుకు దింపాల్సిందే. మరోవైపు ఒక్క బోనాలు సందర్భంగానే రూ. 100 కోట్లకుపైగా లిక్కర్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వానికి కూడా బోనాల సందర్భంగా ఖజానా నిండబోతుంది. అయితే, మద్యం షాపుల వద్ద జనాలు బారులు తీరడంలో వాహనదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నేడు బోనాల పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్ల పరిధిలో ఒక రోజు, సౌత్‌జోన్‌ పరిధిలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 2 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు