Ayodhya Ram Mandir: ఉప్పొంగుతోన్న భక్తిపారవశ్యం.. అయోధ్య కోసం సెర్చ్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులు..!! ఆల్ లైన్ ట్రావెల్ ఫ్లాట్ ఫాం మేక్ మై ట్రిప్ డేటా తెలిపిన వివరాల ప్రకారం గత రెండేళ్లలో మతపరమైన ప్రదేశాల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసేవారి శాతం 97శాతం పెరిగింది. వీటిలో అయోధ్య నగరం, అక్కడ నిర్మిస్తున్న రామమందిరం గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. By Bhoomi 13 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య (Ayodhya)లో అత్యంత సుందరంగా నిర్మించిన రామాలయంలో, జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలివచ్చే లక్షలాది మంది ప్రజలు, ప్రముఖులకు భోజనం, మంచినీళ్లు, బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రోన్లు, పదివేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో భద్రతను ఏర్పాటు చేశారు. హిందూమతపరంగా అత్యంత విశిష్టమైన ఈ కార్యక్రమం దేశంలోని పర్యాటక రంగానికి కొత్త బాటలు వేసింది. ఈ మతపరమైన (Religious Tourism) ప్రదేశాలను సందర్శించాలనుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆన్ లైన్ ట్రావెల్ ఫ్లాట్ ఫాం మేక్ మై ట్రిప్ (MakeMyTrip) డేటా వివరాల ప్రకారం దాదాపు 97శాతం పెరిగింది. 2021-23 మధ్య కాలంలో యాత్రల కోసం ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు ప్రధాన్యత ఇస్తున్నారు. వీటిలో అయోధ్య నగరంతోపాటు రామమందిరం ప్రధాన ఆకర్షణగా నిలించింది. అయోధ్య గురించి ఎక్కువ మంది సెర్చ్: మేక్ మై ట్రిప్ విడుదల చేసిన వివరాల ప్రకారం గత రెండేళ్లలో ప్రజల టూరిజం ప్రిఫరెన్స్ లు మారాయి. మతపరమైన ప్రయాణాలు చేయడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారని ట్రావెల్ అగ్రిగేటర్ డేటా చూపిస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ఇది మరింత బలపడింది. అయోధ్య గురించి ఎక్కువ మంది ఆన్ లైన్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈ సంఖ్య రెండేళ్లలో 585శాతానికి పెరిగింది. టూరిజం ఫ్లాట్ ఫాం వెల్లడించిన ప్రకారం 2021-23 మధ్య కాలంలో అయోధ్య తోపాటు అయోధ్య (585%) ఉజ్జెయిని(359%) బద్రినాథ్(343%) అమర్ నాథ్ (329%) కేదర్ నాథ్(322%) మధుర (223%) ద్వారకాదీష్ (193%) షిర్డి (181%) హరిద్వార్ (117%) బోధ గయా (114%) వీటికోసం ఎక్కువ మంది ప్రజలు ఆన్ లైన్లో సెర్చ్ చేశారు. డిసెంబర్ 30, 2023న అత్యధికంగా సెర్చింగ్: మేక్ మై ట్రిప్ ప్రకారం...అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని నిర్ణయించిన తర్వాత ఆ స్థలం గురించి తెలుసుకోవాలనుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రామాలయ ప్రారంభోత్సవ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ అయోధ్య చరిత్ర గురించి సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య 1806శాతానికి పెరిగింది. 2023 డిసెంబర్ 30న అయోధ్య గురించి అత్యధిక మంది శోధించారు. ఈ రోజు అయోధ్య ఎయిర్ పోర్టును(Ayodhya Airport - Maharishi Valmiki International Airport) ప్రారంభించారు ప్రధాని మోదీ. అయోధ్య లో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ నుంచి రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్(Amrit Bharat Express) రైళ్లను ప్రధాని(PM MODI) జెండా ఊపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: సంక్రాంతికి కొత్త అల్లుడికి ఎందుకంత ప్రాధాన్యత..? దేశం నుంచే కాదు విదేశాల్లో కూడా అయోధ్య రాముడి గురించి సెర్చ్ చేస్తున్నారు. పర్యాటక సంస్థ సమాచారం ప్రకారం అమెరికా నుంచి 22.5శాతం గల్ఫ్ దేశాల నుంచి 22.2 శాతం సెర్చింగ్ జరిగింది. కెనడా, నేపాల్, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రజలు కూడా అయోధ్య రాముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. #ayodhya-ram-mandir #ram-mandir #ayodhya-rama-temple #religious-tourism #makemytrip #online-search మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి