/rtv/media/media_files/2025/08/21/tvk-party-madurai-2025-08-21-16-17-53.jpg)
TVK Party Madurai
TVK Party Madurai: తమిళనాడు మదురైలో హీరో విజయ్(Vijay Thalapathy) స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీకి సంబంధించిన ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పార్టీ నిర్వహిస్తున్న రెండవ మహనాడు(TVK Vettri Maanadu) కోసం ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం, అభిమానులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే…
టీవీకే పార్టీ సమావేశం కోసం సుమారు 100 అడుగుల ఎత్తు గల భారీ జెండా స్తంభం మదురైలో ఏర్పాటు చేశారు. అయితే, మహనాడు ప్రాంగణం మధ్య నిలబెట్టిన ఈ జెండా స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది( Flag Pole Collapse ). ఆ స్తంభం పక్కన పార్క్ చేసి ఉన్న కారుపై పడింది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయి, అందులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
హీరో విజయ్ టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు మృతి
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2025
మదురైలో 100 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన హీరో విజయ్ కి చెందిన టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి నుజ్జునుజ్జయిన కారు.. ఒకరు మృతి
భయంతో పరుగులు తీసిన జనం
Video Credits - Polimer News pic.twitter.com/YWSgnwmh1P
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఊహించని ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పొలిసులు, రెస్క్యూ బృందాలు చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. జెండా స్తంభం ఎందుకు కూలింది? అనే ప్రశ్నపై పోలీసులు విచారణ ప్రారంభించారు. నిర్మాణంలో లోపం, లేక బలమైన గాలులు కారణం అయ్యుండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ భారీ స్తంభాన్ని ఏర్పాటు చేసినప్పుడు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోలేదని అనుమానం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో మదురైలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
టీవీకే పార్టీకి ఇది చాలా బాధాకరమైన ఘటన. పార్టీని స్థాపించిన తర్వాత నుంచి హీరో విజయ్, ప్రజల్లో తన పార్టీకి విశ్వాసం పెంచేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్న ఈ పార్టీకి, ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైనది.
ఈ ఘటనపై టీవీకే నాయకత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.