/rtv/media/media_files/2025/10/09/uttar-pradesh-kasganj-husband-illicit-relationship-with-mother-in-law-2025-10-09-10-14-57.jpg)
uttar pradesh kasganj Husband illicit relationship with mother in law
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సిధ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా పార్సీ గ్రామంలో.. అల్లుడు, అత్త మధ్య వివాహేతర సంబంధం కారణంగా ఒక అమాయకురాలైన భార్య ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన యావత్ ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
kasganj Husband Affair
గ్రామస్తుల కథనం ప్రకారం.. ప్రమోద్ అనే యువకుడు తరచుగా తన అత్తగారింటికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అతనికి తన అత్తతో సాన్నిహిత్యం పెరిగి, అది అక్రమ సంబంధానికి దారితీసింది. మొదట్లో ఈ విషయం ఇంటి నాలుగు గోడలకే పరిమితమైంది. కానీ తాజాగా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ విషయం బంధువులు, ఇరుగుపొరుగు వారికి తెలిసింది.
गंदी मोहब्बत... कासगंज में सास-दामाद के बीच छह महीने से अफेयर, फोटो हुई वायरल तो सबको चला पता
— AajTak (@aajtak) October 9, 2025
पूरी ख़बर : https://t.co/l4f57obADp#Kasganj#AffairScandal#ATCard#AajTakSocialpic.twitter.com/suWghMKUaI
అదే సమయంలో ఈ విషయం ప్రమోద్ భార్య శివానికి కూడా తెలియడంతో.. ఆమె తన భర్త ప్రవర్తనపై అనుమానం పెంచుకుంది. ఇదే విషయంపై ఆమె ప్రమోద్‌ను ప్రయత్నించడంతో తీవ్రమైన గొడవ మొదలైంది. ఇలా తరచూ వారి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అలా ఓ రోజు మరోసారి ఈ దంపతుల మధ్య ఇంట్లో పెద్ద గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రమోద్ తన భార్య శివానిని దారుణంగా కొట్టాడు. ఆ సమయంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో శివాని కొద్దిసేపటికే మరణించింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ఆమె వరండాలో పడి ఉంది. చుట్టూ చెల్లాచెదురుగా వస్తువులు పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సిధ్‌పురా స్టేషన్ ఇంచార్జ్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో శివాని గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలింది. శివాని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త ప్రమోద్, అత్త, మృతురాలి అత్తమామలపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రమోద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు అత్తను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన అత్యంత సున్నితమైనదని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాస్‌గంజ్ ఎస్పీ తెలిపారు. ఈ అక్రమ సంబంధం సామాజిక కట్టుబాట్లను ఉల్లంఘించిందని, ఈ అమానుష చర్యకు పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని శివాని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.