Viral Video: అయ్యో పాపం.. స్కూల్ ముందే కుప్పకూలిన బాలుడు! వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు

ఉత్తరప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలుడు స్కూల్ కి వెళ్తుండగా 'సైలెంట్ అటాక్' తో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update
12 years old boy died with silent attack

12 years old boy died with silent attack

Viral Video:   ఈ మధ్య గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువైపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం సడన్ అటాక్స్ తో నేలరాలుతున్నారు.  చూస్తుండగానే కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నారు.  ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో మరో 12 ఏళ్ల బాలుడు స్కూల్ కి వెళ్తుండగా 'సైలెంట్ అటాక్' తో మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

'సైలెంట్ అటాక్'

ప్రాథమిక సమాచారం ప్రకారం.. వేసవి సెలవుల తర్వాత మంగళవారం తిరిగి స్కూల్స్ ప్రారంభమవడంతో.. అఖిల్ స్కూల్ కి వెళ్ళాడు. అఖిల్ ఆ జిల్లాలోని ఫేమస్ స్కూల్  'సెయింట్ ఆంథనీ'  పాఠశాలలో చదువుతున్నాడు. అయితే ఇంటి పూర్తి ఆరోగ్యంతో స్కూల్ స్కూల్ కి వచ్చిన అఖిల్.. కారు దిగి లోపలి నడుచుకుంటూ వెళ్తుండగా గేట్ వద్ద  స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. దీంతో వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సైలెంట్ అటాక్ ఆ బాలుడి మరణానికి కారణమని తెలుస్తోంది. 

సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏంటి?

సైలెంట్ హార్ట్ ఎటాక్ ని   సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (SMI) అని కూడా పిలుస్తారు.  ఇది తక్కువ లేదా ఎలాంటి గుర్తించదగిన లక్షణాలు లేకుండా సంభవించే గుండెపోటు. ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే లక్షణాలు స్పష్టంగా లేకపోవడం వల్ల చాలామంది గుర్తించలేరు. దీనివల్ల  చికిత్స ఆలస్యం అవుతుంది.

Also Read: Honey Rose: ఆరంజ్ కలర్ డ్రెస్‌లో బాలయ్య హీరోయిన్ కొత్త లుక్ .. వైరలవుతున్న వీడియో

Advertisment
Advertisment
తాజా కథనాలు