థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో స్కూల్ బస్సు చిక్కుకుని 25 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్ విద్యార్థులు బ్యాంకాక్‌లో సెంట్రల్ ఉథాయ్ థాని ప్రావిన్స్ నుంచి అయుతయా బ్యాంకాక్‌కు ట్రిప్‌కు వెళ్తుండగా.. ఈ దారుణం జరిగింది. ఫాహోన్ యోథిన్ రోడ్డులో ఒక్కసారిగా బస్సులో మంటలు చేలరేగాయి. బస్సుకి ముందు ఉన్న ఒక టైర్ పేలిపోవడంతో మంటలు చేలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చూడండి: TGRTC: దసరా వేళ టీజీఆర్టీసీ తీపి కబురు..ఇక నుంచి ఇంటింటికి..!
టైర్ పేలి మంటలు..
బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తుండగా.. ఇందులో 38 మంది విద్యార్థులు ముగ్గురు టీచర్లు ఉన్నారు. మంటల్లో కాలిపోయి 23 మంది దుర్మరణం చెందగా కొందరు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బస్సు అదుపు తప్పడం వల్ల టైర్ పేలి మంటలు చేలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఆ దేశ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చూడండి: దారుణం.. మైనర్‌ను ప్రెగ్నెంట్ చేసిన వృద్ధుడు