Cime: ఘోరం.. ముగ్గురు కూతుళ్లను చంపేసి.. ప్రాణం తీసుకున్న తండ్రి!

తమిళనాడు రాష్ట్రంలో  ఘోర విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి క్షణికావేశానికి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. నమక్కల్ రాశిపురంలో నివాసం ఉంటున్న గోవిందరాజు అనే వ్యక్తి  క్షణికావేశంలో అత్యంత కిరాతకంగా ముగ్గురు కూతుళ్ళ గొంతుకోసి చంపేశాడు.

New Update
Bahadurpura Crime News

Bahadurpura Crime News

Cime: తమిళనాడు రాష్ట్రంలో  ఘోర విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి క్షణికావేశానికి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. నమక్కల్ జిల్లా  రాశిపురంలో నివాసం ఉంటున్న గోవిందరాజు అనే వ్యక్తి  క్షణికావేశంలో అత్యంత కిరాతకంగా ముగ్గురు కూతుళ్ళ గొంతుకోసి చంపేశాడు. అంతేకాదు కూతుళ్లను చంపడానికి ముందుకు భార్య, కొడుకును గదిలో వేస్ బంధించాడు. దీంతో వారు కూడా ఈ ఘోరాన్ని ఆపలేకపోయారు. తండ్రి మూర్ఖత్వానికి ముగ్గురు కూతుళ్లు ప్రతీష శ్రీ, రితిక శ్రీ, దేవశ్రీ అక్కడిక్కడే మరణించారు. ఆ తర్వాత గోవిందరాజు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఆర్ధిక ఇబ్బందులే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఆర్థిక ఇబ్బందులకు చావే పరిష్కారం అనుకున్నాడు గోవిందరాజు!  సమస్యలను ఎదిరించి నిలబడలేక క్షణికావేశంలో తనతో పాటు ముగ్గురు కూతుళ్లను బలి తీసుకున్నాడు. కన్న కూతుళ్లు, భర్తను కళ్ళ ముందే కోల్పోవడంతో గోవింద్ రాజ్ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.  

Advertisment
తాజా కథనాలు