/rtv/media/media_files/2025/10/08/gurugram-2025-10-08-21-10-34.jpg)
సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీకి పనిచేస్తున్న 28 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురుగ్రామ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుభమ్ మీనాకు ఆరు నెలల క్రితం ఢిల్లీకి చెందిన ఒక మహిళతో ప్రేమ వివాహం జరిగింది.
ఆమెతో కలిసి అతను నయాగావ్ ప్రాంతంలోని మాతా కాలనీ సమీపంలో నివసిస్తున్నాడు. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన శుభమ్ ఓ బిగెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. సంవత్సరానికి రూ.20 లక్షల ప్యాకేజీ. మంగళవారం మధ్యాహ్నం శుభమ్ ఇంటినుండి బయటకు వెళ్తున్నానని చెప్పాడు. ఎంతసేపటి కూడా అతను తిరిగి రాకపోవడంతో అతని భార్య అతని కోసం వెతికింది. ఎంత వెతికిన కనిపించలేదు.
రూమ్ లోకి వెళ్లి చూడగా
ఆమె తన ఇంటిపైన రూమ్ లోకి వెళ్లి చూడగా...అతను రూమ్ లో వేలాడుతూ కనిపించాడు. శుభమ్ డిప్రెషన్ కు చికిత్స పొందుతున్నాడని, గతంలో కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడని పొరుగువారు పోలీసులకు తెలిపారు. అయితే శుభమ్ ఆత్మహత్య వెనుక గల కారణం అస్పష్టంగా ఉంది, ఎందుకంటే అతడు ఎటువంటి సూసైడ్ నోట్ కూడా రాయలేదు. శుభమ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. కుటుంబం ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సబ్-ఇన్‌స్పెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుభమ్ భార్య చదువుకుంటుంది. శుభమ్, ఎక్కువగా ఇంటి నుండే పని చేసేవాడని ఆమె చెబుతుంది.
భర్తపై భార్య కర్కషంగా
ఢిల్లీలో కట్టుకున్న భర్తపై భార్య కర్కషంగా వ్యవహరించింది. మదన్‌గీర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న దినేష్ అనే వ్యక్తిపై అతని భార్య అత్యంత కిరాతకంగా దాడి చేసింది. తెల్లవారుజామున భర్త గాఢ నిద్రలో ఉండగా, సలసల మరుగుతున్న నూనెను, ఎర్రటి కారంపొడిని అతని శరీరంపై పోసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్‌ను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేసే దినేష్ (28) అక్టోబర్ 2న రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో దినేష్‌కు ఒక్కసారిగా తీవ్రమైన మంట, నొప్పి కలగడంతో నిద్ర నుంచి లేచి చూశాడు. అప్పటికే అతని భార్య అతని ముఖం, శరీరంపై మరిగే నూనె పోసింది. తీవ్ర వేదనతో అరుస్తున్న దినేష్ కాలిన గాయాలపై ఆమె ఎర్రటి కారంపొడిని చల్లింది.
నొప్పి తట్టుకోలేక దినేష్ కేకలు వేయడంతో, అతని భార్య గట్టిగా అరిస్తే ఇంకొంచెం నూనె పోస్తానని" బెదిరించింది. దినేష్ అరుపులు విని కింద అంతస్తులో ఉన్న ఇంటి యజమాని కుటుంబ సభ్యులు పైకి వచ్చారు. అయితే, భార్య లోపలి నుంచి తలుపుకు తాళం వేసింది. కొంత సమయం తర్వాత ఆమె తలుపులు తీయగా, తీవ్ర గాయాలతో విలవిలలాడుతున్న దినేష్‌ను చూశారు. వెంటనే ఇంటి యజమాని అతన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం దినేష్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు.