/rtv/media/media_files/2024/11/18/N32D7SjOBvnkwhBxHVVd.jpg)
Nalgonda accident
Nalgonda Accident: రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి రోజు వేలాది జీవితాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కఠినమైన ట్రాఫిక్ చర్యలు, అవగాహన కల్పించినప్పటికీ.. ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అతి వేగం, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!
లారీని ఢీకొట్టిన బస్సు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. బస్సులోని 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
Also Read: భారీ రెమ్యునరేషన్ తో బయటకు వచ్చిన విష్ణుప్రియ..వారానికి ఎంతంటే..?