భారీ రెమ్యునరేషన్ తో బయటకు వచ్చిన విష్ణుప్రియ..వారానికి ఎంతంటే..?

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ విష్ణు ప్రియా భారీ రెమ్యునరేషన్ తో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 12 వారల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన విష్ణుప్రియ రూ. 56 లక్షలు తీసుకున్నారట. వారానికి రూ. 4లక్షలు చొప్పున అందుకున్నట్లు సమాచారం.

New Update

Bigg Boss 8 Telugu: బుల్లితెర ప్రేక్షకుల మోస్ట్ ఫేవరేట్ బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం గ్రాండ్  ఫినాలే బరిలో రోహిణి, విష్ణు ప్రియా, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉండగా.. రోహిణి, విష్ణు ప్రియా టాప్ 5 రేస్ నుంచి బయటకు వచ్చేశారు. శనివారం రోహిణి ఎలిమినేట్ అవగా.. ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ టాప్ 5 కంటెస్టెంట్స్ గా స్థానం దక్కించుకున్నారు. టైటిల్ కొడుతుందని భావించిన విష్ణు ప్రియా ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. 

Also Read: Breaking: సంధ్యా థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో ముగ్గురు అరెస్ట్..!

లక్షల్లో రెమ్యునరేషన్ 

అయితే దాదాపు మూడు నెలల పాటు బిగ్ బాస్ హౌస్ ఉన్న విష్ణు ప్రియా భారీ రెమ్యునరేషన్ తో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 12 వారాలకు రూ. 56లక్షల పారితోషికం తీసుకుందట. వారానికి రూ. 4 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. విన్నర్ అమౌంట్ సమానంగా విష్ణు ప్రియా రెమ్యునరేషన్ ఉండడం గమనార్హం. 

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 15న జరగనుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ టైటిల్ రేసులో ఉండగా.. విజేత ఎవ‌రు అవుతారా..? అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సోషల్ మీడియా టాక్ ప్రకారం.. గౌతమ్ లేదా నిఖిల్ టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు