Medchal Murder: మూసి నదిలో దొరకని స్వాతి శరీర భాగాలు.. బోడుప్పల్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ !

మేడ్చల్ బోడుప్పల్ వివాహిత హత్య కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మూసీ నదిలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.  అవి వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update

Medchal Murder: మేడ్చల్ బోడుప్పల్ కి చెందిన వివాహిత స్వాతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కట్టుకున్న భర్తే భార్యను రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను మూసి నదిలో పడేశాడు. ఈ ఘటనపైన ఇప్పటికే కేసు నమోదు చేసిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాతి శరీర భాగాల కోసం మూసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గత 24 గంటలుగా మూసీలో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 

దొరకని స్వాతి శరీర భాగాలు 

ఈ క్రమంలో తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.   మూసీ నదిలో 10 కిలోమీటర్ల వరకు వెతికినా మృతదేహపు ఇతర శరీర భాగాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.  అవి వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం స్వాతి మొండెం మాత్రమే గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడైన స్వాతి భర్త మహేందర్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు  చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

అసలేం జరిగింది

మేడ్చల్ జిల్లా ఈస్ట్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్న మహేందర్- స్వాతి కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు వద్దని వారించినప్పటికీ మహేందర్ మాయలో పడిన స్వాతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అతడిని పెళ్లి చేసుకుంది. ఇంతలోనే మహేందర్ దారుణానికి తెగబడ్డాడు. స్వాతిని  ముక్కలు ముక్కలుగా నరికి చంపేశాడు. రంపంతో స్వాతి శరీరాన్ని ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కాళ్ళు, చేతులు, తలను కవర్ లో ప్యాక్ చేసి మూసి నదిలో పడేశాడు. కేవలం స్వాతి మొండెం మాత్రమే  రూమ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మహేందర్ భార్యపై అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. చనిపోయిన స్వాతి ప్రస్తుతం గర్భవతిగా ఉండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అనుమానం అనే పిచ్చితో కట్టుకున్న భార్యతో పాటు పసి ప్రాణాన్ని కూడా బలి తీసుకున్నాడు కసాయి భర్త. ప్రేమ పేరుతో నమ్మించి.. పెళ్లి చేసుకొని చివరకు.. ఆ అభాగ్యురాలిని దారుణంగా చంపేశాడు. 

Also Read: Hyderabad: లవర్తో కలిసి మొగుణ్ని లేపేసింది బండరాయితో.. హైదరాబాద్లో మరో దారుణం!

Advertisment
తాజా కథనాలు