/rtv/media/media_files/2025/07/17/fire-accident-in-iraq-shopping-mall-2025-07-17-11-47-41.jpg)
fire accident in iraq shopping mall
Iraq Mall Fire Accident: ఇరాక్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది మరణించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. బుధవారం రాత్రి ఐదు అంతస్థుల షాపింగ్ మాల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదటి అంతస్థులో మొదలై వేగంగా భావనమంతటా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. కానీ అప్పటికే చాలా మంది మంటల్లో చిక్కుకుపోయారు. గురువారం తెల్లవారుజాము వరకు షాపింగ్ మాల్లోని బాధితులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటికే కనీసం 50 మంది మృతిచెందినట్లు వార్తలు వస్తున్నాయి.
#BREAKING: At least 50 people, mostly women and children, were killed in a fire that broke out early Thursday at a shopping mall in the city of Kut, Iraq’s Wasit province, Governor Mohammed Jameel al-Miyahi announced. The blaze has since been brought under control.
— Zoom News (@zoomnewskrd) July 17, 2025
🎥: Social… pic.twitter.com/c5dZF9hukx
భయంకరమైన దృశ్యాలు
ఈ ఘటనకు పై ఏఎఫ్‌పీ విలేఖరి మాట్లాడుతూ.. ఆ మాల్ కేవలం ఐదు రోజుల క్రితమే ప్రారంభించినట్లు తెలిపారు. మంటల్లో చిక్కుకుపోయిన వారి కోసం అగ్నిమాపక సిబ్బంది ఇంకా గాలిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆస్పత్రిలో కాలిపోయిన మృతదేహాలను చూసి చలించిపోయానని అన్నారు.
కుటుంబాల ఆవేదన
ఇదిలా ఉంటే ఆస్పత్రుల బయట పదుల సంఖ్యల్లో కుటుంబ సభ్యులు తమ వారికోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తమవారి కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిలో డాక్టర్ నసిర్ అల్-ఖురైషీ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో నా కుటుంబ సభ్యులు ఐదుగురిని కోల్పోయాను అని ఆవేదన చెందారు. ఇంట్లో కరెంటు పోవడంతో భోజనం చేయడానికి మాల్‌కు వెళ్ళాము.ఇంతలోనే రెండవ అంతస్తులో ఒక ఎయిర్ కండిషనర్ పేలింది.. ఆపై మంటలు చెలరేగాయి! మేము అక్కడి తప్పించుకోలేకపోయాము అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ప్రభుత్వ చర్యలు
గవర్నర్ మియాహి ఈ ఘటనపై స్పందిస్తూ మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. అలాగే మాల్ యజమాని, కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా భద్రతా ప్రమాణాలను తక్షణమే సమీక్షించాలని పిలుపునిచ్చారు.
Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా- నిక్ రొమాంటిక్ బీచ్ వీడియో.. ముద్దుపెట్టుకుంటూ రీల్!