పెళ్లైన విషయాన్ని దాచి పెట్టి నిలువున దోచేసింది... ఐటీ ఉద్యోగి సూసైడ్!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఓ అమ్మాయి మోసం చేసి రూ. 15 లక్షలు కాజేసిందని భాధితుడు ఆరోపించాడు.  

New Update
manguluru

కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆత్మహత్య చేసుకునే ముందు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అందులో తన ఆవేదన వ్యక్తం చేశాడు.  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మోసం చేసి చివరకి రూ. 15 లక్షల వరకు కాజేసిందని భాధితుడు ఆరోపించాడు.  

బెదిరించి బంగారం దోపిడీ

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిషేక్ సింగ్ చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీ ఐటీ జాబ్ చేస్తున్నాడు.  అతనికి  గుజరాత్‌కు చెందిన మోనికా సిహాగ్ తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం కాస్త డేటింగ్ కు  దారి తీసింది. అయితే మోనికా సిహాగ్ తనకు పెళ్లి కాలేదని..  నిన్నే పెళ్లి చేసుకుంటానని అభిషేక్ సింగ్ ను నమ్మించి తన శృంగార కోరికలు తీర్చుకుంది. ఆయితే ఆమెకు ఇంతకు ముందే వివాహమైందని, ఆమె ఒక బిడ్డకు తల్లి అని తెలియడంతో అతను షాకయ్యాడు. ఇదే విషయంపై ఆమెను నిలదీస్తే..  ఆమె డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందని లేకపోతే సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన కంపెనీకి పంపిస్తానని బెదిరించిందని బాధితుడు వీడియోలో ఆరోపించాడు. ఆ మహిళ తనను మోసం చేసి తన నుండి రూ.8 లక్షల విలువైన బంగారాన్ని లాక్కుందని బాధితుడు ఆరోపించాడు. ఆమెకు తనలాగే చాలా మందితో ఇలాంటి సంబంధాలు ఉన్నాయని కూడా అతను పేర్కొన్నాడు.

సదరు మహిళ తన వివాహాన్ని దాచిపెట్టి మోసం చేసిందని  ఆరోపిస్తూ వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత అభిషేక్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటక పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాలు CISFలో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తుందని తెలుస్తోంది. 

Also read :   రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ  షామా మొహమ్మద్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు