/rtv/media/media_files/2025/03/05/3rp2hpdnGHCIltPkt2Lu.jpg)
HYD Sirisha Death Case: మలక్ పేట్ శిరీష హత్య కేసులో పోలీసులు మరో సంచలన విషయం బయటపెట్టారు. తన అక్రమ సంబంధాల గుట్టు తెలిసిన శిరీష బతికుంటే ఎప్పటికైనా బయటపెట్టే అవకాశం ఉందని భావించిన ఆడపడుచు సరితా శిరీషను దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే శిరీష భర్త వినయ్ కుమార్, అక్క సరిత, మరో అక్క కొడుకు నిహాల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. శిరీషను తానే చంపానని సరిత ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!
అయితే పెళ్ళికి ముందు సరితా, శిరీష ఇద్దరూ సన్ రైజ్ హాస్పిటల్ లో కలిసి పనిచేసేవారు. ఆ సమయంలోనే శిరీషకు తన తమ్ముడితో పెళ్లి సంబంధం సెట్ చేసింది సరిత. ఆ తరవాత కొంత కాలానికి శిరీష సన్ రైజ్ లో మానేసి కాచిగూడ బ్రిస్టల్ కోన్ హాస్పిటల్ లో చేరింది. మళ్ళీ కొన్నాళ్ళకు వివేర హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కూడా కొన్ని నెలలు చేసి మానేసింది. దీంతో ఒక్క చోట కూడా సరిగ్గా పనిచేయవా అని సరిత- శిరీషకు గొడవ జరిగింది. ఈ గొడవ సమయంలో కోపంలో ఉన్న శిరీష నీ చరిత్ర, నీ అక్రమ సంబంధాలు అన్నీ నాకు తెలుసు.. అందరికీ చెప్తాను అంటూ సరితను కోప్పడింది.
అక్రమ సంబంధం బయటపడుతుందని
ఆ తర్వాత మరుసటిరోజు శిరీషనే వెళ్లి.. సరితకు సారీ చెప్పింది. అనంతరం శిరీష నిద్ర పట్టడం లేదు కొంచం మత్తుమందు ఇవ్వమని సరితను అడిగింది. అయితే సరితకు ముందు నుంచే మత్తు మందు వేసుకునే అలవాటు ఉంది. ఇదే అదనుగా భావించిన సరిత దారుణానికి ఒడిగట్టింది. ఎప్పటికైనా శిరీష తన అక్రమ సంబంధాల గురించి బయటపెట్టే అవకాశం ఉందని భావించి.. మత్తు మందు డోస్ పెంచి ఇచ్చింది. దీంతో సరిత ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు వెల్లడించారు.