మహారాష్ట్రలోని పూణెలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. పుణెలో ఆక్సస్‌ఫర్డ్ గోల్ఫ్‌క్లబ్ హెలిప్యాడ్ నుంచి బయలు దేరిన హెలికాప్టర్ బావ్‌దాన్ దగ్గర రెండు కొండల మధ్య కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇది కూడా చూడండి: విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు
పొగమంచు కారణంగా..
హెలికాప్టర్‌లో ఇద్దరు పైలెట్లు, ఇంజినీర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం 6:45 నిమిషాలకు పుణెలో బయలు దేరిన విమానం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిపోయింది. పొగ మంచు విపరీతంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. మృతుల వివరాలు, హెలికాప్టర్ ప్రైవేట్ లేదా ప్రభుత్వానిదా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. 23 మంది దుర్మరణం