కర్నూలు జిల్లాలో గుండెలను పిండేసిన ఘటన చోటుచేసుకుంది. పుట్టబోయే బిడ్డను చేతులతో ఎత్తుకోవాలని ప్రతీ తండ్రి కలల కంటాడు. కానీ ఈ కలల తీరకుండానే తండ్రి మట్టిలో కలిసిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాలో రాజోలిలో శివ అనే యువకుడు భార్యతో కలిసి ఉంటున్నారు. గతేడాది శివకు కర్నూలు జిల్లాలోని బనగానిపల్లెకు చెందిన లక్ష్మితో వివాహం జరిగింది.
ఇది కూడా చూడండి: దూసుకొస్తున్న దానా తుఫాన్.. గంటకు 120 కి.మీ వేగంతో..
అదుపు తప్పి పడిపోవడంతో..
పెళ్లయిన కొన్ని నెలలకు గర్భం దాల్చగా డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. అయితే శివ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రాజోలిలో ఎస్పీ కాలనీ వద్ద అదుపు తప్పి పడిపోయాడు. శివకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కానీ లక్ష్మీకి మాత్రం చిన్న గాయాలు అయ్యాయని, ఎలాంటి ప్రమాదం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఇది కూడా చూడండి: ఈ ఏడాది చివరి నాటికి మతిపోయే టెక్నాలజీ.. అంబానీ మరో సంచలన ప్రకటన!
ఇంతలో లక్ష్మీకి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి డెలివరీ కోసం ఆమెను కూడా అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో శిశ పరిస్థితి విషమించడంతో నిన్న తెల్లవారు జామున మరణించాడు. లక్ష్మీ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెతో చెప్పలేదు. శివ చనిపోయిన గంట తర్వాత వైద్యులు ఆమెకు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇది కూడా చూడండి: పెప్సీ, కోకా కోలా నుంచి ఇకపై బడ్జెట్ డ్రింక్స్.. కారణమేంటి?
ఆమె డెలివరీ అయిన తర్వాత భర్త చనిపోయాడన్న విషయాన్ని తెలియజేశారు. భర్త మరణించాడని బాధపడాలో లేకపోతే కొడుకు పుట్టాడని సంతోష పడాలో ఆ కుటుంబ సభ్యలకు తెలియడం లేదు. పుట్టిన బిడ్డను చూసే అదృష్టం తండ్రికి లేదని, తండ్రిని చూసే అదృష్టం బిడ్డకు లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామం విషాదంలోకి మునిగిపోయింది.
ఇది కూడా చూడండి: అమరావతికి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు!