/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)
Kurnool Bus Accident
Kurnool Bus Accident: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కేసులో వేమురి కావేరి ట్రావెల్స్(Kaveri Travels) మేనేజ్‌మెంట్, డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఉలిందకోండా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు..
Kurnool Bus Accident Driver Arrested
ఈ కేసును ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు చేయగా... బస్సు నడిపిస్తున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహచరుడు జి. శివనారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, సంబంధిత నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేసి, 19 మంది ప్రయాణికుల మరణానికి బాద్యుడుగా ఉంచారు. అలాగే, బస్సు మేనేజ్‌మెంట్ కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంచారు.
ప్రమాదానికి ప్రధాన కారణం..?
ప్రమాద స్థలంలో మరింత సాక్ష్యాలు సేకరించడానికి డిఐజీ డాక్టర్ కొయ్య ప్రవీణ్ స్వయంగా స్థలానికి వచ్చి రీకన్‌స్ట్రక్షన్ (పునఃనిర్మాణ) పరిశీలన నిర్వహించారు. ఈ చర్యతో బస్సు ప్రమాద సమయానికి ఎంత వేగంతో వెళ్తోంది? డ్రైవర్ ఏ విధంగా నియంత్రణ కోల్పోయాడో, ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు సాక్ష్యాలు, ఫిర్యాదుల ఆధారంగా మిరియాల లక్ష్మయ్యను, బస్సు మేనేజ్‌మెంట్ పై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసు ద్వారా రవాణా కంపెనీల భద్రతా ప్రమాణాలు పాటించడం, డ్రైవర్ లు కచ్చితంగా నియమాలు అనుసరించడం ఎంత ముఖ్యమో మరోసారి చర్చకొచ్చింది.
ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం, ఆ రాష్ట్ర రవాణా శాఖ, పోలీసులు ఇలాంటి ఘటనలను నిరోధించేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ఈ సంఘటన కర్నూలులో రవాణా భద్రతపై కొత్త అలెర్ట్ సృష్టించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు, ట్రావెల్స్ కంపెనీలు అన్ని నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు పలు రకాల సాక్ష్యాలను సేకరించి, న్యాయ చర్యలకు ముందుకు వెళుతున్నారు.
Follow Us