Kurnool Bus Accident: మొన్న భర్త.. నేడు కూతురు.. ఆ తల్లికి దిక్కెవరు! ధాత్రి తల్లి వాణి కన్నీటి కథ!

మొన్న భర్త.. నేడు కూతురుని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది ఆ తల్లి.  నిన్న కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్  గన్నమనేని ధాత్రి తల్లి వాణి ఆవేదన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.  

New Update
kurnool bus accident

kurnool bus accident

Kurnool Bus Accident:  మొన్న భర్త.. నేడు కూతురుని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది ఆ తల్లి.  నిన్న కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్  గన్నమనేని ధాత్రి తల్లి వాణి ఆవేదన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. రెండేళ్ల కిందట అనారోగ్యంతో భర్త మరణించగా.. ఇప్పుడు ఉన్న ఏకైక కూతురు కూడా శాశ్వతంగా దూరమైంది. రెండేళ్ల వ్యవధిలోనే భర్త మరణంతో దిక్కుతోచక విలవిలలాడుతున్న ఆ తల్లి బాధ వర్ణనాతీతం.

దిక్కుతోచని స్థితిలో తల్లి!

యద్దనపూడి మండలం పూనురూకు చెందిన గన్నమనేని భానుప్రకాష్- వాణి దంపతులకు ధాత్రి ఏకైక సంతానం. భానుప్రకాష్ గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసేవారు. అయితే రెండేళ్ల కిందట అనారోగ్య సమస్యలతో ఆయన మరణించడంతో భార్య, బిడ్డ ఒంటరయ్యారు. భర్త మరణం అనంతరం వాణి  ఇంకొల్లు మండలం పూసపాడులోని తల్లి సూర్యకుమారి వద్ద ఉంటోంది. మరోవైపు ధాత్రి బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా నిలుస్తోంది. కూతురు సెటిల్ అవడంతో ఇక ఆమెకు పెళ్లి చేయాలని మంచి సంబంధాల కోసం చూస్తున్నారు వాణి. కానీ, ఇంతలోనే బస్సు ప్రమాదం ఆ తల్లి ఆశలను సమాధి చేసింది. బస్సు ప్రమాదంలో ధాత్రి కాలి బూడిదైపోయింది. కూతురి చివరి చూపుకు కూడా నోచుకోలేకపోవడంతో తల్లి వాణి గుండెపగిలేలా రోదిస్తున్నారు. 

Also Read: Rashmika Post: నా గుండె పగిలింది.. కర్నూల్ బస్ ప్రమాదంపై రష్మిక కన్నీటి పోస్ట్!

#Kurnool Bus Accident
Advertisment
తాజా కథనాలు