హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ హైదర్ షాకోట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భార్యను అతి కిరాతకంగా భర్త హతమార్చాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ తన భార్య, పిల్లలతో కలిసి షాకోట్‌లో నివసిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య కలహాలు ఉన్నాయి. ఏదో విధంగా భార్యను ప్రతీరోజు టార్చర్ చేసేవాడు.
ఇది కూడా చూడండి: ఆరవ రోజు.. దుర్గమ్మ దర్శనం ఏ అవతారంలో అంటే?
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా..
భార్య చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కూడా స్పందించలేదట. ఎలాగైన భార్యను చంపాలని ప్లాన్ చేసి.. ఆమెను హతమార్చాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్యను సుత్తితో కొట్టి హత్యచేశాడు. భార్యను చంపిన తర్వాత పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి లొంగిపోయాడు. కలహాల కారణంగా తన భార్యను హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు.
ఇది కూడా చూడండి: పెళ్లిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు