బిగ్ బాస్ ట్విస్ట్ .. ఆ నలుగురికి బ్లాక్ టికెట్స్..! డబుల్ ఎలిమినేషన్ బిగ్ బాస్ 8 వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో హోస్ట్ నాగార్జున టికెట్ టూ ఫినాలే టాస్కులకు సంబంధించి కంటెస్టెంట్స్ కి క్లాస్ ఇచ్చారు. ఇందులో భాగంగా పృథ్వీ, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకు బ్లాక్ టికెట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రోమో మీరూ చూసేయండి. By Archana 30 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా కొనసాగుతోంది. 15 వారల ఈ గేమ్ షోలో ఇంకా కేవలం మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. మొత్తం 22మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు 8మంది ఉన్నారు. ఈ 8 మందిలో 5 కంటెస్టెంట్స్ మాత్రమే టాప్ 5కి చేరుకుంటారు. ఇప్పటికే ఈ వారం నిర్వహించిన టికెట్ టూ ఫినాలే గెలిచి.. బిగ్ బాస్ మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. లేటెస్ట్ ప్రోమో.. నలుగురికి బ్లాక్ టికెట్స్ ఇది ఇలా ఉంటే.. తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ముందుగా హోస్ట్ నాగార్జున మొదటి ఫైనలిస్ట్ అవినాష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు కంటెస్టెంట్స్ కి బాంబ్ పేల్చారు. అలాగే ఈ వారం జరిగిన టికెట్ టూ ఫినాలే టాస్కులకు సంబంధించి కంటెస్టెంట్స్ క్లాస్ ఇచ్చినట్లుగా ప్రోమోలో కనిపించింది. అయితే ఈ టాస్కుల్లో కంటెస్టెంట్ పర్ఫామెన్స్ ఆధారంగా నలుగురికి గోల్డెన్ టికెట్స్, నలుగురికి బ్లాక్ టికెట్స్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. పృథ్వీ, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియకు బ్లాక్ టికెట్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? ఈ వారం నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్, టేస్టీ తేజ ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే అవినాష్ టికెట్ టూ ఫినాలే గెలవడంతో అతనికి ఎలిమినేషన్ గండం తప్పింది. దీంతో టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో తేజతో పాటు నబీల్ లేదా పృథ్వీలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు టాక్. Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి