Rotten Chicken: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

బేగంపేట్‌లోని బాలయ్యా చికెన్ సెంటర్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఏడు క్వింటాల కుళ్లిన మాంసం లభ్యమైంది. ఈ కుళ్లిన మాంసాన్ని వివిధ రెస్టారెంట్లు, బార్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

New Update

వీకెండ్‌తో సంబంధం లేకుండా ప్రతీ రోజూ చికెన్ తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో కంటే రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో చికెన్ పకోడీలు ఇలా ఒకటేంటి.. రకరకాలుగా తయారు చేసినవి తింటుంటారు. ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, మద్యం దుకాణాల్లోని పర్మిట్‌ రూమ్స్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పలు హోటళ్లలో చికెన్ ఐటమ్స్ తినేవాళ్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు బయటపెట్టిన విషయాలు చూసిన కూడా చికెన్ తినడం మానరు.ః

ఇది కూడా చూడండి: పోలీసులు ఆకస్మిక దాడులు.. పబ్‌లో యువతులతో అసభ్యకరమైన డ్యాన్సులు

భారీగా కుళ్లిన చికెన్..

తాజాగా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా.. భారీగా కుళ్లిన చికెన్‌ను గుర్తించారు. ఏకంగా ఏడు క్వింటాళ్ల చికెన్‌ను అధికారులు సీజ్ చేశారు. బేగంపేట ప్రకాశ్‌ నగర్‌లోని బాలయ్య చికెన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ వందల కేజీల కొద్దీ కుళ్లిపోయిన కోడి మాంసాన్ని గుర్తించారు. రోజుల కొద్దీ ఫ్రిడ్జ్‌లలో నిల్వ ఉంచిన చికెన్‌తో పాటుగా కొవ్వు పదార్థాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన కోడి మాంసానికి కెమికల్స్ వేసి ఆ చికెన్‌ను నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాలు, బార్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఇది కూడా చూడండి:  TG Group-1: గ్రూప్-1 వివాదం.. అసలు జీవో 55, జీవో 29 ఏంటి?

నగరంలోని పలు బార్లకు సైతం కుళ్లిన కోడి మాంసాన్ని సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బాలయ్య చికెన్ సెంటర్‌ను సీజ్ చేసి.. పెద్ద ఎత్తున చికెన్ ఎక్కడెక్కడ సరఫరా చేయటంపై ఆరా తీస్తున్నారు. ఈ చికెన్ సెంటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బయట ఎక్కువగా ఫుడ్ తినేవారు జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్‌లో ఎక్కువగా కల్తీ ఫుడ్ విక్రయిస్తున్నారని ఇంట్లోనే తయారు చేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. 

ఇది కూడా చూడండి: సల్మాన్‌ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్

ఇదెలా ఉంటే కొండాపూర్‌లోని శరత్ సిటీ మాల్‌లో కూడా ఆహార భద్రత అధికారులు టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాల్‌లో ఉన్న చట్నీస్‌లు చూడగా.. ఆహార తయారీకి వాడే పదార్థాలను బొద్దింకలు ఉండే ప్రదేశంలో ఉంచారని అధికారులు గుర్తించారు. గోధుమపిండి, రవ్వ పెట్టిన పదార్థాల్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందని, ఉల్లిపాయలు, క్యాబేజీలు కూడా మనుషులు తినేలా లేవని తెలిపారు. సింక్ కూడా చాలా దరిద్రంగా దుర్వాసనతో ఉందని, కూరగాయలను కట్ చేయడానికి ఐరన్ చాకుల్ని వాడుతున్నారని అధికారులు తెలిపారు. డస్ట్ బిన్స్‌ను కూడా ఓపెన్ గానే వదిలేశారని, తయారు చేసిన ఆహార పదార్థాలకు అసలు మూతలు పెట్టడం లేదని అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్‌లో ఉంచిన సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ కూడా మూతలతో కప్పి లేదన్నారు. 

ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్

#chicken
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe