/rtv/media/media_files/2025/06/19/wife-lover-2025-06-19-18-03-20.jpg)
ఆమెకు పెళ్లైంది. మంచి భర్త దొరికాడు.. చదువుకుంటానంటే భార్యను బాగా చదివించాడు.. ఆమెకు పోలీసు ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఆమె బుద్ది మాత్రం మరోవైపు వెళ్లింది. భర్తకు తెలియకుండా మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అనుమానం వచ్చిన భర్త వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దొరికిన సమయంలో ఆమె ప్రియుడు మంచం కింద దాక్కున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన బీహార్ లో జరిగింది.
తల్లి నగలను కూడా అమ్మి
వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఈమె కోసం భర్త తన తల్లి నగలను కూడా అమ్మి ఆమెను కానిస్టేబుల్ చేశాడు. తీరా ఉద్యోగం వచ్చాక మాత్రం చెడు అలవాట్లకు అలవాటుపడింది. అగ్నిమాపక దళంలో పనిచేస్తున్న మరో ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వాళ్ళ బండారం బయటపెట్టాడు భర్త. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీరి అసలు కథను బయటపెట్టాడు. భర్త కష్టపడి చదివిస్తే ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
— RTV (@RTVnewsnetwork) June 18, 2025
భార్యను చదివించడానికి అతను తన తల్లి నగలను కూడా అమ్మేశాడు, కానీ ఆమెకు ఉద్యోగం వచ్చిన వెంటనే ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం ప్రారంభించిందని భర్త ఆవేదన..
ఆ మహిళ బీహార్‌లోని వైశాలి జిల్లాలో అగ్నిమాపక దళంలో కానిస్టేబుల్‌గా… pic.twitter.com/TOt8hnLgnS