Honey Trap : అమీర్పేట్లో హనీ ట్రాప్.. 81 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.లక్షలు కొట్టేశారు

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా  పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది.

New Update
honey trap

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా  పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి దగ్గరై, ఇద్దరు శృంగారంలో పాల్గొన్నట్లు వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో రికార్డును ఆధారంగా చేసుకుని మరోకరి చేత ఆ మహిళ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. 

డబ్బులు ఇవ్వకపోతే

తన భర్తకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని, డబ్బులు ఇవ్వకపోతే వీడియోను లీక్ చేస్తామని బెదిరించింది. బ్లాక్ మెయిల్ తో భయపడిన ఆ వృద్ధుడు ఆ మహిళకు పలు దఫాలుగా మొత్తం రూ. 7 లక్షలు ఇచ్చాడు. పదేపదే డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన వృద్ధుడు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వారి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

బ్లాక్ మెయిల్ చేసిన మహిళ, ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఈ ముఠా గతంలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడిందా అని పరిశీలిస్తున్నారు. పోలీసులు ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

Advertisment
తాజా కథనాలు