/rtv/media/media_files/2026/01/25/madhuri-2026-01-25-11-16-08.jpg)
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను అడ్డుతొలగించుకున్న భార్య మాధురి కిరాతకం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. మాధురికి గోపీ అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త శివనాగరాజుకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివనాగరాజు, తన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాధురి, తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని భయపడి, భర్తను ఎలాగైనా హతమార్చాలని స్కెచ్ వేసింది.
భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు
చాలా తెలివిగా పావులు కదిపిన మాధురి, మొదట భర్త వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని బెదిరించి తన పేరుపై రాయించుకుంది. ఆస్తి చేతికి రాగానే, తన ప్రియుడు గోపీ, ఒక ఆర్ఎంపీ డాక్టర్‌తో కలిసి శివనాగరాజును హత్య చేసింది. తన దారికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో పాటు, ఆస్తి మొత్తం తనకే దక్కాలనే దురాశతో ఈ ఘాతుకానికి పాల్పడింది.
ముందుగా ఆర్ఎంపీ డాక్టర్ తెచ్చిన నిద్రమాత్రలను భార్య మాధురి బిర్యానీలో కలిపి భర్త శివ నాగరాజుకు ఇచ్చింది. అనంతరం అతడ్ని ప్రియుడి సాయంతో హత్య చేసేసింది. ఇక, ప్రియుడు గోపితో పాటు అతడి స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శివ నాగరాజు హత్యపై మాధురి, గోపి, ఆర్ఎంపీలను విచారణ చేస్తున్నారు.
Follow Us