/rtv/media/media_files/2025/02/17/XnJMvH5E7ridE2SNEy8t.jpg)
కర్ణాటకలోని మైసూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ లో నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మృతులను చేతన్ (45), అతని భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (62)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ముందుగా చేతన్ తన కుటుంబ సభ్యులకు విషం తినిపించి ఆ తరువాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారి మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించలేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, డీసీపీ జాన్హవి, విద్యారణ్యపురం ఇన్‌స్పెక్టర్ మోహిత్, ఇతర పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టారు. విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అప్పులే కారణమా?
కుటుంబమంతా ఇంత కఠినమైన చర్య తీసుకోవడానికి కారణం మానసిక క్షోభే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చేతన్ భారీ అప్పులతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. చేతన్ ఫోన్ రికార్డులు, అతని ఆర్థిక లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ కుటుంబం గత పది సంవత్సరాలుగా అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుందని, సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లుగా పక్కంటివాళ్లు చెబుతున్నారు.
Also Read : Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి!