చనిపోయిన వ్యక్తి సిమ్‌ కార్డుతో సైబర్ నేరగాళ్లు ఏం చేశారంటే?

రిటైర్డ్ ఉద్యోగి సమీఉద్దీన్ ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి 2022లో చనిపోయారు. సమీఉద్దీన్ సిమ్‌కార్డు తనతో పాటు సోదరి బ్యాంకు ఖాతాలకు లింక్ ఉండటంతో వ్యక్తిగత వివరాలు తెలుసుకున్న స్నేహితుడు జహంగీర్, మహ్మద్ ఆసిఫ్‌ పాషాతో కలిసి లక్షల డబ్బు కాజేశాడు.

CV anand: రూ.712కోట్ల సైబర్‌ స్కామ్‌..ఎలా చేశారో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
New Update

మరణించిన రిటైర్డ్ ఉద్యోగి సిమ్‌ కార్డుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేసిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎండీ సమీఉద్దీన్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2013లో పదవీ విరమణ తీసుకున్న అతను 2022లో మరణించారు. సమీఉద్దీన్ చనిపోయిన తర్వాత కూడా అతని సిమ్‌కార్డు తన బ్యాంకు ఖాతాలతో పాటు, సోదరి సబిహా సుల్తానా ఖాతాలకు కూడా లింక్ చేసి ఉంది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేటప్పుడు సమీఉద్దీన్‌కు జహంగీర్ అనే వ్యక్తితో పరిచయం ఉండేది. వ్యక్తిగత విషయాలు తెలుసుకున్న జహంగీర్.. సమీఉద్దీన్ చనిపోయిన తర్వాత మహ్మద్ ఆసిఫ్‌ పాషాతో కలిసి కుట్ర పన్నాడు. 

తప్పుడు పత్రాలతో..

ఈ ఏడాది జూన్‌లో సమీఉద్దీన్ ఎయిర్‌టెల్ సిమ్‌ను బ్లాక్ చేయించి.. తప్పుడు పత్రాలతో తన పేరుతో సిమ్‌ను రీయాక్టివేట్ చేయించాడు. ఆ ఫోన్‌నంబర్‌తో ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసి.. సమీఉద్దీన్‌తో పాటు తన సోదరి సబిహా సుల్తానా అకౌంట్లతో ఉన్న డబ్బును దుండగులు ట్రాన్స‌ఫర్ చేసుకున్నారు. మొత్తం రూ. 20,18,557 డబ్బుతో పాటు క్రెడిట్‌కార్డులోని డబ్బును కూడా దోచుకున్నారు. అకౌంట్ల నుంచి డబ్బులు కట్ కావడంతో సబిహా సుల్తానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మహ్మద్ ఆసిఫ్ పాషా దగ్గర రూ.18 లక్షల నగదు, మొబైల్, క్రెడిట్ కార్డు, వాటి బిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. జహంగీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

#cybercrime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి