/rtv/media/media_files/2026/02/21/couple-sentenced-2026-02-21-08-04-53.jpg)
పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, వాటిని వీడియోలు తీసి విదేశాలకు సప్లై చేసిన నరరూప రాక్షసుల పాపం పండింది. దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పోక్సో కోర్టు నిందితులైన మాజీ ఇంజినీరు దంపతులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మాజీ జూనియర్ ఇంజనీర్ రామ్ భవన్, అతనికి సహకరించిన భార్య దుర్గావతికి కోర్టు మరణశిక్ష విధించింది.
రామ్ భవన్ ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, 2010 నుండి 2020 మధ్య కాలంలో ఈ దారుణాలకు పాల్పడ్డాడు. మూడేళ్ల పసికందు నుంచి మొదలుకొని 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, వాటిని వీడియోలు తీసి విదేశాలకు అమ్మేవారు. ఈ జంట సుమారు 47 దేశాలకు బాధితుల ఫోటోలు, వీడియోలను పంపినట్లు విచారణలో తేలింది. ఇంటర్నెట్ వేదికగా దాదాపు 2 లక్షలకు పైగా అశ్లీల చిత్రాలను షేర్ చేశారు.
అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి ప్రదీప్ కుమార్ ఈ కేసును "అత్యంత అరుదైనది"గా అభివర్ణించారు. నేరపూరిత కుట్ర, అశ్లీల కంటెంట్ స్టోరేజ్ వంటి అభియోగాల కింద వీరిని దోషులుగా తేల్చారు. నేరస్థులకు శిక్ష విధించడంతో పాటు, బాధితులైన 33 మంది బాలురకు న్యాయం చేసే దిశగా కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి బాధితుడికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును బాధితులందరికీ సమానంగా పంపిణీ చేయాలని కోర్టు పేర్కొంది.
Follow Us