INDORE : దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పది మంది మృతి

దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.

New Update
indore

దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ట్రాక్టర్‌ ఓ చెరువులో పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికితీశామని పోలీసులు తెలిపారు. నిమజ్జనం కోసం వివిధ గ్రామాల నుండి దుర్గామాత విగ్రహాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌పై భక్తులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం

దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. చందంపేట మండలం దేవరచర్లలో పండుగ కోసమని ఓ ఇంటికి బంధువులు వచ్చారు. సరదాగా దగ్గర్లో ఉన్న వాగులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఓ 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు మరో ఇద్దరు యువకులు యత్నించారు. చివరికి వాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

Advertisment
తాజా కథనాలు