/rtv/media/media_files/2025/03/14/bQIZY76AAwfHy2IVaKps.jpg)
పోలీసుల బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తన కూతురి మరణానికి న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య తాలూకాలోని హెబ్బకవాడి గ్రామంలో జరిగింది. 20 రోజుల క్రితం 21 ఏళ్ల విజయలక్ష్మి అనే యువతి రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తమ్మూరు సమీపంలోని మారసింగనహళ్లి గ్రామానికి చెందిన హరికృష్ణ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది.
Also read : 14ఏళ్ల బాలుడి అద్భుత ఆవిష్కరణ.. 7 సెకన్లలోనే గుండె గుట్టు చెప్పే యాప్
విజయలక్ష్మి, హరికృష్ణ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ గత ఏడాదిన్నర కాలంగా శారీరక సంబంధాన్ని కూడా కలిగి ఉన్నారు. అయితే హరికృష్ణకు తనలాగే ఇతర అమ్మాయిలతో కూడా పరిచయం ఉందని తెలుసుకున్న విజయలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే హరికృష్ణ పెళ్లికి నిరాకరించాడమే కాకుండా తనను అసభ్యకరమైన మాటలతో బెదిరించాడన్న మనస్తాపంతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.
కూతురి మరణానికి న్యాయం జరగలేదని
విజయలక్ష్మి మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె తండ్రి నంజుండే గౌడ మాండ్య గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్న తన కూతురి మరణానికి న్యాయం జరగలేదని బాధపడుతూ విజయలక్ష్మి తల్లి లక్ష్మి గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నిరసనకు దిగారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర వ్యతిరేకత రావడంతో హరికృష్ణపై 189, 191, 64, 108, 54, 118, సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు మాండ్య పోలీసులు.
Also read : Kidnap: వరంగల్‌లో కిలాడీ లేడీ .. బాలికలను కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, అత్యాచారాలు