/rtv/media/media_files/2025/10/25/school-bus-drivers-2025-10-25-10-08-02.jpg)
School Bus Drivers
School Bus Drivers: బెంగళూరులో(Bengaluru) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 36 మంది స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం మత్తులో(School Bus Drivers Drunk and Drive) వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం బెంగళూరు సిటీ వెస్ట్ డివిజన్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం 7:30 నుండి 9:00 వరకు 15 పోలీస్ స్టేషన్ పరిధులలో ఈ ఆపరేషన్ చేపట్టారు. హలాసూరు గేట్, అశోకనగర్, సదాశివనగర్, బయటరాయనపురా, మగడి రోడ్ వంటి ప్రాంతాల్లో స్కూల్ బస్ డ్రైవర్లను తనిఖీ చేయగా అడ్డంగా దొరికిపోయారు.
School Bus Drivers Drunk and Drive
రెండు గంటల ఆపరేషన్‌లో దాదాపు 5,881 స్కూల్ బస్ డ్రైవర్లను తనిఖీ చేయగా వీరి లో 36 మంది డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు అందరిపై కేసులు నమోదు చేసి, రిజియనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్(RTO)కి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయమని సిఫార్సు చేశారు. అలాగే ఈ డ్రైవర్లు పనిచేస్తున్న స్కూల్స్ కు కూడా నోటీసులు పంపి వివరణ ఇవ్వమని, తక్షణ చర్యలు తీసుకోవమని సూచించారు.
డీసీపీ (ట్రాఫిక్ - వెస్ట్ డివిజన్) అనుప్ శెట్టి మాట్లాడుతూ, “జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సూచనల మేరకు స్కూల్ బస్ డ్రైవర్లపై మద్యపానం తనిఖీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. భద్రత కోసం అలాంటి తనిఖీలు రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. స్కూల్ బస్సు డ్రైవర్లలో బాధ్యతా భావం పెంపొందించడమే లక్ష్యం” అని తెలిపారు.
అంతేకాక, పోలీసులు స్కూల్ నిర్వాహకులను పూర్వం డ్రైవర్స్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు, తరచుగా వైద్య పరీక్షలు చేయాలని, భవిష్యత్తులో ఈ విధమైన ప్రమాదకర తప్పుడు ప్రవర్తన నివారించమని సూచించారు.
ఈ చర్య ద్వారా స్కూల్ పిల్లల భద్రతకు పెద్ద పీట వేస్తున్నాం అని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో కూడా స్కూల్ వాహన డ్రైవర్లపై రేడ్లు, తనిఖీలు కొనసాగుతాయని హెచ్చరించారు.
ఈ ఘటనతో బెంగళూరులో స్కూల్ వాహన భద్రతపై కొత్త అవగాహన కలిగిస్తూ, మద్యం సేవిస్తూ బండి నడుపుతున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు.
Follow Us