NTR District: NTR జిల్లా తిరువూరులో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ కామాంధుడు మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చందు అనే యువకుడు విసన్నపేట మండలం నూతిపాడు గ్రామానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని రెండు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమను తిరస్కరించడంతో కళ్ళు మూసుకుపోయిన చందు దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 10న ఇద్దరు మైనర్ బాలుర సహాయంతో ఆ అమ్మాయిని ఓ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించాడు. అయినప్పటికీ బాలిక తన తల్లికి చెప్పడంతో.. విషయాన్ని ఊళ్లోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టారు. కానీ అక్కడ న్యాయం జరగకపోవడంతో తిరువూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు చందు పై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
NTR District: NTR జిల్లాలో దారుణం … భవనంలోకి తీసుకెళ్లి మైనర్ బాలికపై అత్యాచారం
NTR జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందు అనే యువకుడు నూతిపాడు గ్రామానికి చెందిన మైనర్ బాలికను 2 నెలలుగా ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె తిరస్కరించడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చందు పై ఫోక్సో కేసు నమోదు చేశారు.
Translate this News: