Tamil Nadu: ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత

తమిళనాడులోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం జరిగింది. తమిళర్ కచ్చి పార్టీ నేత శివరామన్ ఫేక్ ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలియడంతో శివరామన్‌, ప్రిన్సిపల్‌తో పాటు 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు.

New Update
Tamil Nadu: ఎన్‌సీసీ క్యాంప్ పేరుతో  బాలికపై అత్యాచారం.. అదుపులో ఆ పార్టీ నేత

Tamil Nadu: తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇటీవలే నామ్ తమిళర్ కచ్చి పార్టీ నేత శివరామన్ ఓ ప్రైవేట్ స్కూల్ ను సందర్శించారు. అయితే ఆ స్కూల్‌లో ఎన్‌సీసీ యూనిట్ లేకపోయినా.. సేవా కార్యక్రమాలతో క్యాంప్‌ నిర్వహిస్తే ఎన్‌సీసీ యూనిట్ అమలు చేసే అనుమతి వస్తుందని యాజమాన్యాన్ని ఒప్పించాడు.  ఆ తర్వాత ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎన్‌సీసీ పేరుతో ఫేక్ క్యాంప్ నిర్వహించాడు. ఇందులో 17 మంది బాలికలు పాల్గొన్నారు. కాగా, ఈ క్యాంపులోని బాలికల పై శివరామన్  దారుణానికి పాల్పడ్డాడు. ఎనిమిదో తరగతి బాలికను శివరామన్ అత్యాచారం చేయడంతో పాటు.. మరో 12 మంది పైగా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు.

చివరిగా ఆగస్టు 9న శివరామన్ అఘాయిత్యాలు స్కూల్ యాజమాన్యం దృష్టికి  వెళ్లాయి. అయినప్పటికీ స్కూల్ పరువు పోతుందని పోలీసులకు చెప్పకుండా నిజం దాచే ప్రయత్నం చేసింది యాజమాన్యం. తీరా బాధిత బాలికలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. క్యాంపులో పిల్లల పర్యవేక్షణ కోసం టీచర్లను నియమించకపోవడం, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం కావడంతో.. శివరామన్‌, స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read: Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు