Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 

పూణేలో 13 ఏళ్ల బాలికను తండ్రి, మేనమామ, కజిన్ అత్యాచారం చేసి బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది. స్కూలులో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పాఠం చెబుతుండగా.. జరిగిన విషయాన్ని టీచర్ కు చెప్పింది బాలిక. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాక్సో చట్టం కింద నిందితులను అరెస్ట్ చేశారు. 

Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 
New Update

Father - Uncle - Cousin Killed A Girl : ఆడపిల్లకు (Girls) ఇంటిలోనే రక్షణ దొరకని పరిస్థితి వచ్చింది. కన్న తండ్రి.. సొంత మేనమామ.. కజిన్ ముగ్గురూ ఒక చిన్నారిపై పలుసార్లు అత్యాచారానికి (Abused) పాల్పడ్డ సంఘటన పూణే (Pune) లో చోటుచేసుకుంది. పదమూడేళ్ల చిన్నారిని బెదిరించి.. ఒకరికి తెలియకుండా ఒకరు.. ఈ దారుణానికి ఒడికట్టారు. ఇంత దారుణం జరిగినా ఆ చిన్నారి విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయింది. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తామని ఆ ముగ్గురూ బాలికను బెదిరించడంతో ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. 

గుడ్ టచ్.. బ్యాడ్ టచ్..
స్కూల్లో టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పాఠాలు చెబుతుండగా.. ఆ 13 ఏళ్ల బాలిక విషయాన్ని తన టీచర్ కు వివరించింది. ఈ క్లాసు సమయంలో చెడ్డగా తాకడం అంటే ఏమిటో టీచర్ వివరిస్తుండగా.. విద్యార్థిని తనపై జరిగిన అత్యాచారం గురించిన వివరాలు వెల్లడించింది. 2023లో తన 20 ఏళ్ల బంధువు(కజిన్) మొదట తనపై అత్యాచారం చేసినట్టు బాలిక చెప్పింది. ఆమెను కొట్టి.. అత్యాచారం చేసిన తరువాత.. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడు. 

ఇక 2024 జనవరిలో తన మేనమామ తనపై అత్యాచారం చేశాడనీ.. తాను రెసిస్ట్ చేయడంతో తనను కొట్టి.. నోటిని కట్టేసి తనపై లైంగిక దాడికి పాల్గొన్నాడని ఆమె పేర్కొంది. ఇక తన తండ్రి కూడా తనను వేధించాడని.. అత్యాచార దారుణానికి పాల్పడ్డాడనీ ఆ చిన్నారి చెప్పడంతో టీచర్ షాక్ అయ్యారు. దీంతో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది టీచర్. 

ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన పోలీసులు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (POCSO) కింద అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.

Also Read : ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?

#pune #good-touch-bad-touch #physically-abused #family-members
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి