ANU College: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.! గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్‌కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బుద్ధిజంలో M.A చేస్తున్న కొండన్న యూనివర్సిటీలో పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్తపింజర పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. By Archana 08 Sep 2024 in గుంటూరు క్రైం New Update షేర్ చేయండి ANU College: గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో(ANU) విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్ధి క్యాంపస్ లో పాము కాటుకు బలై మృతిచెందాడు. మయన్మార్ కు చెందిన కొండన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో M.A బుద్ధిజం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం కొండన్న ఏదో రీసెర్చ్ పని కోసం యూనివర్సిటీలో పుట్టగొడుగులను సేకరించేందుకు వెళ్ళాడు. అతడు పుట్టగొడుగులు సేకరిస్తున్న సమయంలో కొండన్నను రక్తపింజర పాము కాటేసింది. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే కొండన్న పరిస్థితి విషమించడంతో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ANU అధికారులు తెలిపారు. Also Read: Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ 'భార్గవి నిలయం' - Rtvlive.com #guntur #guntur-anu-college-incident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి