Sports: మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్

ఒకప్పుడు టీమిండియాలో మెయిన్ ప్లేయర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బెస్ట్ ఫ్రెండ్. తన ఆటతో క్రికెట్ ప్లేయర్లను మరిపించిన వినోద్ కాంబ్లీ ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నాడు.

New Update
Sports: మద్యం మత్తులో నడిరోడ్డు మీద సచిన్ బెస్ట్ ఫ్రెండ్

Vinod Kambli: తన బ్యాటింగ్‌తో మెరుపులు మెరిపించాడు. టీమ్ ఇండియాలో మెయిన్ ప్లేయర్‌‌గా ఉండేవాడు. తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ సచిన్‌తో కలిసి ఎన్నో సార్లు అద్భుతమైన స్కోర్లను చేశాడు. అతనే వినోద్ కాంబ్లీ
వినోద్ కాంబ్లీ టీమిండియా తరఫున 17 టెస్టు మ్యాచ్‌లు, 104 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ క్రికెట్‌లో 54.20 సగటుతో 1084 పరుగులు చేయగా., ODI లలో కూడా 32 కంటే ఎక్కువ సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లో కాంబ్లీ 9965 పరుగులు చేశాడు. అతని సగటు సగటు 60.

కానీ ఇప్పుడు అతనే డబ్బుల్లేక, మద్యం మత్తులో రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. మంచి ఆటగాడు, ఆడగలిగే సత్తా ఉన్నా కూడా నిరూపించుకోలేకపోయాడు. ఎంత తొందరగా వచ్చాడో అంత తొందరగా..టీమ్ ఇండియాకు దూరం అయిపోయాడు. ఒకపక్క తన ఫ్రెండ్ క్రికెట్‌లో శిఖరాలను అధిరోహిస్తున్నా తాను మాత్రం వెనక్కు రాలేకపోయాడు. పోనీ మిగతా ప్లేయర్లలాగే క్రికెట్‌లో వేరే ఏదైనా కెరియర్ ఎంచుకుని అందులో సెటిల్ అయ్యాడా అంటే అది కూడా జరగలేదు. దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తోంది. క్రికెట్‌కు దూరం అయిన తర్వాత డబ్బులు లేకుండా పోయాయి. సైన పనిలేక మద్యానికి బానిస అయ్యాడు వినోద్ కాంబ్లీ. దానికి తడు ఇప్పుడు వయసుతో పాటూ వచ్చిన అనారోగ్యాలు వేధిస్తున్నాయి. వినోద్ కాంబ్లీ నేడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పక్కనున్న వ్యక్తులు సపోట్ చేస్తున్నా నడవలేకపోతున్నాడు.

అసలేమయిందో అన్నది ఎవ్వరికీ స్పష్టంగా తెలియడం లేదు. కానీ వినోద కాంబ్లీ ఆరోగ్యం చాలరోజుల నుంచి సరిగ్గా లేదని మాత్రం తెలుస్తోంది. చాలాసార్లు ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యాడు. ఒకసారి గుండెపోటు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. కొంతకాలం క్రితం ఆయన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు.. సచిన్ సహాయం చేశాడు. అంతేకాదు ఆయన్ను సచిన్ అతన్ని అకాడమీలో కోచ్‌ గా నియమించాడు కూడా. అంతే కాదు ముంబై టీ20 లీగ్‌లో జట్టుకు కోచ్‌ గా కూడా ఆయన ఉన్నారు. కానీ.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో అతను కోచ్‌గా ఉద్యోగం కోల్పోయాడు.

Also Read:Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి..

Advertisment
తాజా కథనాలు