Amaravati: రాజధాని నిర్మాణాల సీఆర్‌డీఏ కీలక ఆదేశాలు

AP: రాజధాని పరిధిలో పిచ్చిమొక్కల తొలగింపునకు సీఆర్‌డీఏ కార్యాచరణ చేపట్టింది. నెల రోజుల్లోగా పిచ్చిచెట్లు, ముళ్లచెట్లు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. రైతులకిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల వద్ద శుభ్రం చేయాలని సీఆర్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది.

New Update
Amaravati: రాజధాని నిర్మాణాల సీఆర్‌డీఏ కీలక ఆదేశాలు

Amaravati: రాజధాని పరిధిలో పిచ్చిమొక్కల తొలగింపునకు సీఆర్‌డీఏ కార్యాచరణ చేపట్టింది. రాజధాని నిర్మాణాల వద్ద చెత్త, ముళ్ల కంపలను తొలగించే దిశగా కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లోగా పిచ్చిచెట్లు, ముళ్లచెట్లు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. రైతులకిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్ల వద్ద శుభ్రం చేయాలని సీఆర్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది.

నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ..

అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నోటిఫై చేస్తూ గెజిట్‌ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాలు నిర్మించనుంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ ప్రాంతమైన 1,575 ఎకరాల ప్రాంతాన్ని నోటిఫై చేసింది సీఆర్డీఏ. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్‌ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేసింది. సీఆర్డీఏ చట్టం సెక్షన్‌ 39 ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది. రాయపూడి, నేలపాడు గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం నోటిఫై. లింగాయపాలె, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ కాంప్లెక్స్‌ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన చేశారు సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌.

Advertisment
తాజా కథనాలు