రాజోలులో పిచ్చికుక్క స్వైర విహారం..ముగ్గురు చిన్న పిల్లలపై దాడి

అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరుణుడు వదలడం లేదు. ఓ వైపు వరదలతో ప్రజల అల్లాడిపోతుంటే.. మరో వైపు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాల్ని టెన్షన్ టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.

New Update
రాజోలులో పిచ్చికుక్క స్వైర విహారం..ముగ్గురు చిన్న పిల్లలపై దాడి

వరదలే కాదు మూగజీవాలు కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉప్పెనలా వచ్చిన వరదలకు కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్న మైపోతుంటే.. మరో వైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా(ambedkar konaseema district) రాజోలు మండలం బి.సావరం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్న పిల్లలపై దాడి చేసింది. వారిని తీవ్రంగా గాయ పరిచింది. కుక్క దాడిలో గాయపడిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని ప్రథ‌మ చికిత్స కోసం రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరొకరికి ఎక్కువ గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలంటూ బీసవరం గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామంలో పిచ్చికుక్క సంచారంతో పిల్లలకు బయటకు వచ్చి ఆడుకోవాలంటేనే భయంతో అల్లాడిపోతున్నారు. ముగ్గురు పిల్లలకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు.

పసికందుపై దాడి

ఏపీ-తెలంగాణలో కుక్కల దాడులు ఆగడం లేదు. శునకాల దాడికి ఇప్పటికే పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ముగ్గురు చిన్నారిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అయితే ఆదివారం ఉదయం ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్క (dog)హటాత్తుగా వచ్చి ఆ పసికందు మీద పడి దాడి చేసింది. వీధి కుక్కల సమస్యలను పరిగణలోనికి తీసుకొని స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించవలసిందిగా కోరుతున్నారు.

కొనసాగుతోన్న వరద:
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉగ్ర గోదారమ్మ లంక గ్రామాలపై విలయతాండవం చేస్తోంది. ధవళేశ్వరం (Dhavaleswaram) ఆనకట్ట నుంచి లక్షల క్యూసెక్కులవరకు దిగువకు వదులుతుండటంతో..కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు ఇళ్లను చుట్టుముట్టేసింది. ప్రమాదకరంగా నాటు పడవల్లో లంక వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. లక్షల పెట్టుబడులు వరదార్పణవ్వడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కొన్ని లంక గ్రామాల్లో ఇళ్లలోకి నీరు రాకపోయినా.. ఇళ్ల చుట్టూ మాత్రం నీళ్లు భారీగా నిలిచిపోయాయి. ముమ్మిడివరం పరిధిలోని కూనా లంకలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఆదివారం కూడా గోదావరికి భారీ వరద ధవళేశ్వరం ఆనకట్టకు చేరనుంది. మరి కొన్ని రోజులు వరద ఉధృతి కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు