కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు నేచురల్ వాటిని వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ముఖం అందం ఉండాలంటే నేచురల్ ఫేస్ ప్యాక్స్ వాడటం అలవాటు చేసుకోవాలి. చాలామందికి అందంగా కనిపించాలనే కోరికతో మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. దీంతో చర్మంపై ఉండే బాక్టీరియా చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేసి మొటిమలకు వచ్చేదుకు అవకాశం ఉంటుంది. క్రాన్‌బెర్రీ సీడ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీన్ని నేరుగా చర్మానికి అప్లై చేసుకోచ్చు. ఇది చర్మానికి మాయిశ్చరైజ్, సహజమైన మెరుపును ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగడుతుంది. అలాంటి సహజసిద్ధమైన ఉత్పత్తుల గురించి తెలుసుకుద్దాం.
ఇది కూడా చదవండి: ఎప్పుడైనా వాకింగ్‌ను ఇలా చేశారా..? ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు
క్రాన్‌బెర్రీస్ హీథర్ కుటుంబానికి చెందిన చిట్టి పండు ఇది. బ్లూబెర్రీస్, లింగన్‌బెర్రీలకు సంబంధించినవి ఈ క్రాన్‌బెర్రీస్ పండు ఎరుపు రంగులో గుండ్రంగా, చిన్నవిగా ఉంటుంది. రుచి అనేది కొద్దిగా వగరు, పులుపుగా ఉంటుంది. క్రాన్‌బెర్రీస్ పండులో విటమిన్-సీ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్-సీ చర్మానికి సహాయపడే ప్రోటీన్, దృఢమైన, మృదువుగా ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుంది. క్రాన్ బెర్రీ ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు బెస్ట్ అంటున్నారు. క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మొటిమలకు, మెరిసే చర్మాన్ని, మృదువైన ఛాయకు దోహదం చేస్తుంది.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో క్రాన్‌బెర్రీస్ ఎక్కువగా సహాయపడుతుంది. క్రాన్‌బెర్రీస్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు క్రాన్‌బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాల కావిటీస్, ఇన్ఫ్లమేటరీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎండిన క్రాన్‌బెర్రీస్‌లో ఎక్కువ విటమిన్లు, కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. క్రాన్‌బెర్రీలను ప్రతీరోజు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని క్రీములు తాత్కాలికంగా ముఖ అందాన్ని పెంచినప్పటికీ..సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చుపెట్టి ముఖ సౌందర్యాన్ని పాడుచేసుకోవడం కాకుండా కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను వాడితే ఎఫెక్టివ్‌గా ఉంటుంది.