పోలవరం బాధితులతో సీపీఎం పాదయాత్ర

ఏపీ సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు పోలవరం పునరావాస బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు. హనుమాన్ జంక్షన్ నుంచి గన్నవరం వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబూరావు, మహిళలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

New Update
పోలవరం బాధితులతో సీపీఎం పాదయాత్ర

CPM march with Polavaram victims

ప్యాకేజీ ఇస్తాం

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో పోలవరం పునరావాస బాధితుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడ్డాయన్నారు. గత వరదల్లో 193 గ్రామాలు మునిగితే 56 గ్రామాలే గుర్తించారని, 2013 చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన వారిని యూనిట్‌గా గుర్తించి ప్యాకేజీ ఇస్తాం అన్నారని.. పూర్తి స్థాయి ప్యాకేజీ ఇవ్వకుండా ఖాళీ చేయాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అక్కడ ప్రతి ఇంటికి ఒక‌ విషాద గాధ ఉందని, గోదావరి వరదలు వారికి మొదటి నుంచి అలవాటేనని శ్రీనివాసరావు అన్నారు.

ముంపు వల్ల మళ్లీ భయం

పోలవరం కాపర్ డ్యాం వల్ల మీద ఉన్నా.. అంత పెద్ద వరద వచ్చిందని.. ఇప్పుడు వరద ముంపును గుర్తు చేసుకుని మళ్లీ భయ పడుతున్నారన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటే... పునరావాసం బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. రూ. 33 వేల‌ కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. మోదీ ఏడున్నర వేల కోట్లు మాత్రమే ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ఇచ్చే అ డబ్బును పునరావాసానికే ప్రభుత్వం ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు, ఇతర అవసరాలకు మళ్లిస్తానంటే కుదరదన్నారు. కాలనీల్లో ముంపు బాధితులకు సాయం అందించలేదని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పునరావాస ప్యాకేజీ తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎంపై ఉందని శ్రీనివాసరావు అన్నారు.

బాధితుల ఆక్రందనలు సీఎంకు పట్టవా..

నేను ఉన్నాను, నేను విన్నాను అన్న సీఎంకు బాధితుల ఆక్రందనలు కనిపించడం లేదాని ప్రశ్నించారు. నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నా చేపడతామని చెప్పారు. ఐదో తేదీన చర్చలుకు రావాలని పిలిచారని, ఆరోజు ప్రభుత్వం స్పందన బట్టి తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 13 రోజులుగా పాదయాత్ర చేస్తుంటే సీఎం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పాలకులు బూతులు తిడితేనే స్పందిస్తున్నారని వాళ్ల లాగే మేము కూడా ఇక తిడితేనే పనులు చేస్తారేమోనని అన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సాయం అందించాలని, లేకుంటే బాధితులతో కలిసి సమర శంఖం పూరిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు