Tammineni: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్!

తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు ఏఐజీ ఆసుపత్రి బృందం. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. మరిన్ని టెస్టులు చేస్తున్నామని వెల్లడించారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు ఆసుపత్రిలో రావద్దని కోరారు.

New Update
Tammineni: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్!

Tammineni Veerabhadram: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల అయింది. అనారోగ్యంతో హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తమ్మినేని. ప్రస్తుతం ఆయనను ఐసీయూలు ఉంచారు వైద్యులు. వివిధ రకాల పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

ALSO READ: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్!

ఆందోళన వద్దు..

తమ్మినేని ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ఏఐజీ ఆసుపత్రి వెల్లడించింది. పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఎవరుకుడా తమ్మినేని చూసేందుకు ఆసుపత్రికి వెళ్ళొద్దని సీపీఎం వర్గాలు పేర్కొన్నాయి. వైద్య పరీక్షల రిపోర్ట్ రాగానే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియపరుస్తాం అని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.

గుండెకు స్టంట్..

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కు 2004లో గుండెకు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. మళ్ళీ 20 సంవత్సరాల తరువాత ఈరోజు ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో తమ్మినేని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చెరిపించారు.

అసలేం జరిగింది..

సీపీఎం (CPI) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్లు వారు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స చేయగా ఇది కేవలం గ్యాస్ట్రిక్ సమస్య అని వైద్యులు అన్నారు. అయినా.. మరోసారి నొప్పి రావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తరలించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు (Paleru) నుంచి పోటీ చేసి ఓడిపోయారు తమ్మినేని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.

ALSO READ: ‘నిన్ను లేపేస్తాం’..ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపులు

Advertisment
తాజా కథనాలు